Hyderabad Weather Update: భాగ్యనగర వాసులకు ఎండల తీవ్రత నుండి ఉపశమనం లభించింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్షం ప్రారంభమైంది.
నగరంలోని కొన్ని ప్రధాన ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తుండగా, మరికొన్ని చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షం పడుతోంది.
Read Also: Kowdipally CHC Opening: త్వరలో కౌడిపల్లిలో నిరుపేదలకు ఉచిత వైద్య సేవలు.
Hyderabad Weather Update
Hyderabad Weather Update: ఎక్కడెక్కడ చిరుజల్లులు?
నగరంలోని పలు కీలక ఐటీ మరియు నివాస ప్రాంతాలలో వాతావరణం మేఘావృతమై, తేలికపాటి నుండి మోస్తరుగా చిరుజల్లులు పడుతున్నాయి. జూబ్లీహిల్స్, ఫిలింనగర్, బోరబండ , యూసుఫ్‌గూడ. ఎస్‌ఆర్‌నగర్. సనత్ నగర్ మరియు వాటి పరిసర ప్రాంతాలు. చిరుజల్లుల మాదిరిగా కాకుండా, నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఆకాశం పూర్తిగా నల్లటి మేఘాలతో నిండిపోయి ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.
- హైదర్‌గూడ (Hyderguda) మరియు ఉప్పరపల్లి (Upparpally) పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షం కారణంగా రహదారులు జలమయమయ్యే అవకాశం ఉంది.
- వాహనదారులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com

