Dailyhunt
హైదరాబాద్‌ను మించిన రాజధానిగా అమరావతి మారుతుంది

హైదరాబాద్‌ను మించిన రాజధానిగా అమరావతి మారుతుంది

వార్త 3 weeks ago

Chandrababu Naidu Speech: టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు చేశారు.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన ‘మూడు రాజధానుల ముక్కలాట’కు ముగింపు పలికామని, ఇకపై రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి వెలుగుతుందన్నారు.

Read also: Tirumala Annaprasadam: తిరుమలలో రికార్డు స్థాయిలో అన్నప్రసాదాలు

Amaravati Capital City Master Plan concept.

Chandrababu Naidu Speech: సామాన్యులకు రాజకీయ గుర్తింపు

తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సామాన్య ప్రజల పక్షాన ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. సాధారణ కార్యకర్తలను సైతం చట్టసభలకు పంపిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి, వారిని రాజకీయంగా బలోపేతం చేసిన మొదటి పార్టీ తమదేనని ఆయన గుర్తు చేశారు.

హైదరాబాద్‌ను మించిన రాజధానిగా అమరావతి

ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తాము తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలు నేడు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చంద్రబాబు పేర్కొన్నారు. అదే విజన్ తో అమరావతిని అభివృద్ధి చేస్తామన్నారు. “హైదరాబాద్ కంటే మెరుగైన, అత్యున్నత ప్రమాణాలు కలిగిన రాజధానిగా అమరావతిని నిర్మిస్తాం” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

అనంతపురంలో జర్నలిస్టులకు మెగా ఉచిత వైద్య శిబిరం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha