Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైవేపై ఘోరం.. కుటుంబం ముందే కారు డ్రైవర్‌పై అల్లరి మూక  దాడి!

హైవేపై ఘోరం.. కుటుంబం ముందే కారు డ్రైవర్‌పై అల్లరి మూక దాడి!

వార్త 2 weeks ago

Bengaluru Mysuru Expressway Attack: కర్ణాటకలోని అత్యంత బిజీగా ఉండే బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేపై (Bengaluru-Mysuru Expressway) నడిరోడ్డుపైనే ఒక కుటుంబంపై అల్లరి మూక బరితెగించి దాడి చేసిన ఘోర ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది.

హైవే మధ్యలో కారును అడ్డగించి, కుటుంబ సభ్యుల ముందే డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తిని విచక్షణారహితంగా కొట్టిన దృశ్యాలు వెనుక వస్తున్న మరో కారు డ్యాష్‌క్యామ్ (Dashcam Video) లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పౌరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also:MP Road Accident Today: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు దుర్మరణం!

కారు డోర్లు బలవంతంగా తెరిచి.. ఇనుప రాడ్లతో దాడి

వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా.. ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తున్న ఒక బ్లూ కలర్ కారును కొందరు యువకుల గుంపు అడ్డుకుంది. కారు ఆగడమే ఆలస్యం.. ఆకతాయిలు ఒక్కసారిగా వాహనంపైకి దూసుకెళ్లారు. కారు డోర్లను బలవంతంగా తెరిచి, డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వ్యక్తిపై అందరూ చూస్తుండగానే పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఆ కారులో ఒక మహిళ, చిన్నారితో సహా కనీసం 4 నుంచి 5 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా ప్రాధేయపడుతున్నా వినకుండా అల్లరి మూక సదరు వ్యక్తిని చితకబాదింది. వారిలో ఒక యువకుడు లోహపు వస్తువుతో (ఇనుప రాడ్ లాంటిది) విక్టిమ్‌ను బలంగా కొడుతున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రాధేయపడిన మహిళ.. కాపాడిన తోటి ప్రయాణికులు

దాడి తీవ్రమవడంతో భయంతో వణికిపోయిన కారులోని మహిళ రోడ్డుపైకి పరుగులు తీసి, తన భర్తను (లేదా కుటుంబ సభ్యుడిని) వదిలేయాలంటూ నిందితులను చేతులు జోడించి వేడుకుంది. అంతటితో ఆగని ఆ గుంపు బాధితుడిని కారులోంచి బయటకు లాగి రోడ్డుపై పడేసి మరి కొట్టింది. ఇది గమనించిన హైవేపై వెళ్తున్న ఇతర వాహనదారులు, తోటి ప్రయాణికులు వెంటనే స్పందించి కారు దిగి వచ్చి నిందితులను అడ్డుకున్నారు. వారందరూ కలిసి అల్లరి మూకను వెనక్కి నెట్టి వేయడంతో దాడి మరికొంత తీవ్రమవ్వకుండా ఆగింది.

Bengaluru Mysuru Expressway Attack: మద్దూరు సమీపంలో ఘటన – భయం లేని ఆకతాయిలు

ఈ దారుణ ఘటన ఎక్స్‌ప్రెస్‌వేలోని మద్దూరు (Maddur) పరిధిలో జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడికి గల ఖచ్చితమైన కారణాలు (రోడ్ రేజ్ లేదా పాత కక్షలా అనేది) ఇంకా తెలియరాలేదు. పట్టపగలు, వందలాది వాహనాలు తిరిగే జాతీయ రహదారిపై ఒక కుటుంబంపై ఇంతలా తెగబడటం చూస్తుంటే ఆకతాయిలకు చట్టమన్నా, పోలీసులన్నా ఎంతటి నిర్లక్ష్యం ఉందో అర్థమవుతోందని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఘోర ఉదంతంపై స్థానిక పోలీసుల నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. డ్యాష్‌క్యామ్ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Epaper: epaper.vaartha.com

శ్రీలంక జైల్లో డ్రగ్స్ గ్యాంగ్‌ల వీరంగం - ఘర్షణల్లో 25 మంది మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha