Kharge Haldwani Purification : ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మరియు రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రసంగించిన సభా వేదికను 'శుద్ధీకరించిన' ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది.
దళిత నాయకుడైన ఖర్గే పాల్గొన్నందునే ఆ ప్రాంతం అపవిత్రమైందనే నెపంతో ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపిస్తూ, కాంగ్రెస్ నాయకులు చట్టపరమైన పోరాటానికి దిగారు. ఆగస్టు 8న ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లా హల్ద్వానీ రామ్‌లీలా మైదానంలో ఖర్గే నేతృత్వంలో శాంతియుతంగా బహిరంగ సభ జరిగింది. ఖర్గే ఎస్‌సీ (SC) వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో, ఆయన సభా స్థలాన్ని బీజేపీ నేతలు శుద్ధీకరించారని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎస్‌టీ (ST) విభాగం మాజీ వైస్ ఛైర్మన్ టీఆర్ రామప్ప బెంగళూరులోని విధాన సౌధ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఆగస్టు 31న బెంగళూరు పోలీసులు ఉత్తరాఖండ్ బీజేపీ నేతలు మరియు ఇతరులపై ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేశారు. అనంతరం తగిన విచారణ నిమిత్తం ఈ కేసును ఉత్తరాఖండ్‌లోని సంబంధిత పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు.
Kerala Road Accident: కేరళలో ఘోర ప్రమాదం.. 8 మంది విద్యార్థులు మృతి
Kharge Haldwani Purification
Kharge Haldwani Purification :అంటరానితనం మరియు చట్టపరమైన అంశాలు
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక దళిత అగ్రనేత ప్రసంగించిన ప్రదేశాన్ని ‘అపవిత్రం’ అయినట్లుగా చిత్రీకరించి శుద్ధి చేయడం తీవ్ర అవమానకరమని కాంగ్రెస్ వర్గాలు మండిపడ్డాయి.: ఈ చర్య ప్రత్యక్షంగా అంటరానితనాన్ని ప్రోత్సహించడమేనని, ఎస్సీ/ఎస్టీ (అట్రాసిటీ నిరోధక) చట్టం మరియు పౌర హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం ఇది తీవ్రమైన శిక్షార్హమైన నేరమని ఫిర్యాదుదారు స్పష్టం చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు, ప్రతివిమర్శలు చోటుచేసుకుంటున్నాయి. సామాజిక సమానత్వంపై దాడికి దిగారంటూ ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, ఈ వివాదం తీవ్ర రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది.

