Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హమ్మయ్య ఎట్టకేలకు రష్యా చమురుపై ఆంక్షలు సడలించిన అమెరికా

హమ్మయ్య ఎట్టకేలకు రష్యా చమురుపై ఆంక్షలు సడలించిన అమెరికా

వార్త 6 days ago

మెరికా, ఇరాన్ ల మధ్య కొనసాగుతున్న హోర్ముజ్ జలసంధి ఉద్రికత్తలతో చమురు కొరతతో ప్రపంచ దేశాలతో పాటు భారతదేశం కూడా ఇబ్బంది పడుతున్నది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

రష్యా ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల కొనుగోళ్లపై విధించిన ఆంక్షలను మరోమారు సడలిస్తూ గడువును పొడిగించింది. సముద్రంలో నిలిచిపోయిన రష్యా చమురును కొనుగోలు చేసేందుకు ప్రపంచ దేశాలకు జూన్ 17 వరకు మరో నెల రోజుల పాటు లభించిన ఈ అవకాశం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Read Also: Modi Norway Tour : భారత్-నార్వే బంధానికి స్వర్ణయుగం ప్రధాని మోదీ

 Russia Crude Oil

Russia Crude Oil: అమల్లోకి వచ్చిన జనరల్ లైసెన్స్ 134C

అమెరికా ఆర్థిక శాఖకు చెందిన ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ (OFAC) ఈ మినహాయింపును పొడిగిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా విడుదల చేసిన జనరల్ లైసెన్స్ 134C నిబంధనలు మే 18 నుంచి అమల్లోకి వచ్చాయి. గతంలో ఏప్రిల్ 17న జారీ చేసిన 134B లైసెన్స్ గడువు మే 16తో ముగియడంతో, దాని స్థానంలో ఈ తాజా ఉత్తర్వులను తీసుకొచ్చారు. రష్యా చమురుపై అమెరికా ఇలా గడువు పొడిగించడం ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు: ఇరాన్‌పై అమెరికా చేపట్టిన సైనిక చర్యల తదనంతర పరిణామాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలపై ఒత్తిడి పెరిగి, చమురు దిగుమతులపై ఆధారపడే పలు దేశాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. అమెరికా ఆంక్షల మినహాయింపులతో సంబంధం లేకుండా భారత్ తన సొంత వ్యూహంతో ముందుకు వెళుతోంది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను భారత్ నిరంతరాయంగా కొనసాగిస్తోందని కేంద్ర పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ స్పష్టం చేశారు. కేవలం వాణిజ్యపరమైన అంశాలు, మార్కెట్ ధరలు, మరియు సరఫరా పరిస్థితులను బేరీజు వేసుకుంటూ దేశ ప్రయోజనాల ఆధారంగానే భారత్ నిర్ణయాలు తీసుకుంటుందని ఆమె స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఇరాన్ పై ట్రంప్ అటాక్ కు ప్లాన్ చేసాడు కానీ ..!!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha