Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'హనుమాన్ అంశ్' మూవీ రివ్యూ

'హనుమాన్ అంశ్' మూవీ రివ్యూ

వార్త 2 weeks ago

Hanuman Ansh Movie: స్టార్లు, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, మాస్ పాటలు లేకుండా ఓ సినిమా వందల కోట్లను రాబట్టడం సామాన్యమైన విషయం కాదు. రూ. 200 కోట్లు ఖర్చు చేస్తే రూ.

400 కోట్లు రాబట్టడంలో ఆశ్చర్యం లేదు, కానీ కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన 'హనుమాన్ అంశ్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 425 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు 'నీమ్ కరోలీ బాబా' జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 7న విడుదలై తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Bhogi Movie First Single: శర్వానంద్ 'భోగి' నుంచి 'ఎగిలివారంగ' పాట విడుదల

 'Hanuman Ansh' Movie Review

Hanuman Ansh Movie: కథ

లక్ష్మీ నారాయణ శర్మ (శోభినవ్ సత్య) చిన్నతనంలోనే తల్లిని కోల్పోతాడు. తండ్రి మరో వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక, పసితనం నుంచే ధ్యానంలో ఎక్కువ సమయం గడుపుతుంటాడు. ఆయనలోని ఆధ్యాత్మిక చింతన ఊరు విడిచి వెళ్లేలా చేస్తుంది. శ్రీరాముడిని దర్శించాలంటే ముందుగా హనుమంతుడిని ఆరాధించాలనే భావన ఆయనలో బలంగా నాటుకుపోతుంది. అప్పటి నుంచి హనుమను ఉపాసిస్తూ క్షేత్రాలను దర్శిస్తుంటాడు.

పశుపక్షుల భాషను అర్థం చేసుకుంటూ బాబా చేసే చిన్న చిన్న మహిమలను ముందుగా ఓ పిట్టల వేటగాడు గుర్తించి ఆయనకు మొదటి శిష్యుడిగా మారతాడు. ఓసారి గుహలో సర్పాల మధ్య బాబా ధ్యానం చేసుకోవడం చూసిన ఆ శిష్యుడి ద్వారా బాబా మహిమలు బయటకు తెలుస్తాయి. మరో సందర్భంలో ఫస్ట్ క్లాస్ బోగీ ఎక్కిన బాబాను ఒక ఆంగ్లేయ అధికారితో కలిసి టీసీ రైలు నుంచి దింపేస్తాడు. అంతే.. ఆ ట్రైన్ అక్కడి నుంచి అంగుళం కూడా కదలదు. ఆ అధికారి క్షమాపణ కోరిన తర్వాతే రైలు ముందుకు సాగుతుంది. ఈ సంఘటన 'నీమ్ కరోలి' గ్రామం వద్ద జరగడంతో ఆయనను అందరూ 'నీమ్ కరోలీ బాబా'గా పిలవడం మొదలుపెడతారు.

విశ్లేషణ

యోగులు, సిద్ధపురుషుల బయోపిక్‌లు తెరకెక్కించేటప్పుడు సాధారణంగా గ్రాఫిక్స్, హెవీ సౌండ్ ఎఫెక్ట్స్‌తో పూనకాలు తెప్పించే ప్రయత్నం చేస్తారు. కానీ దర్శకుడు అలాంటి అర్భాటాలకు పోకుండా నీమ్ కరోలీ బాబా జీవిత ప్రయాణాన్ని అత్యంత సహజంగా మలిచారు. ప్రథమార్ధంలో బాబా బాల్యం, ఆధ్యాత్మిక ప్రయాణం, నీమ్ కరోలీ బాబాగా మారిన వైనాన్ని చూపించగా, ద్వితీయార్థంలో ఆయన వైవాహిక జీవితం మరియు ఇతర మహిమలను కవర్ చేశారు.

అయితే, సర్పాల మధ్య ధ్యానం చేయడం, ట్రైన్ ఆగిపోవడం వంటి భారీ విస్మయానికి గురిచేసే సీన్లను కూడా చాలా సాధారణంగా తేల్చేయడం కాస్త అసంతృప్తిని కలిగిస్తుంది. అయితే బడ్జెట్ పరిమితులను దృష్టిలో ఉంచుకుంటే మేకర్స్ సహజత్వానికే ప్రాధాన్యత ఇచ్చారని అర్థమవుతుంది. కొన్ని చోట్ల సన్నివేశాలు కాస్త సాగదీసినట్లు అనిపించినా కథనంలో స్పష్టత ఉంది.

నటీనటులు, సాంకేతిక వర్గం

  • నటీనటులు: నీమ్ కరోలీ బాబా పాత్రలో శోభినవ్ సత్య ఒదిగిపోయారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు చాలా సహజంగా నటించారు.
  • సాంకేతిక విభాగం: చాలా తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కించినప్పటికీ ఆ కాలం నాటి వాతావరణాన్ని ప్రతిబింబించడంలో మేకర్స్ విఫలం కాలేదు. విశాల్ ఫొటోగ్రఫీ, సాధు సుశీల్ తివారి నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. శంఖ్ రాధ్యక్ష ఎడిటింగ్ బాగుంది.

ముగింపు

'హనుమాన్ అంశ్' చిత్రం నీమ్ కరోలీ బాబా జీవిత విశేషాలను, ఆయన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. నీమ్ కరోలీ బాబా గురించి తెలుసుకోవాలనుకునే వారికి, భక్తిరస చిత్రాలను మరియు ఆధ్యాత్మిక చింతనను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఒక మంచి అనుభూతిని ఇస్తుంది.

కామ్రేడ్ కళ్యాణ్ మూవీ రివ్యూ & రేటింగ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha