Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కన్నకూతుర్లను బావిలో పడేసిన కిరాతకుడు.. కుటుంబం మొత్తం జైలుకు!

కన్నకూతుర్లను బావిలో పడేసిన కిరాతకుడు.. కుటుంబం మొత్తం జైలుకు!

వార్త 2 months ago

Karimnagar twins Crime updates: ఆడపిల్లలు పుట్టారనే వివక్ష, ఆస్తిపై ఉన్న మితిమీరిన వ్యామోహం ఒక తండ్రిని హంతకుడిగా మార్చాయి. నిందితుడు శ్రీశైలంకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

తనకున్న దాదాపు రెండు కోట్ల రూపాయల విలువైన ఆస్తి మొత్తం ఆ ఇద్దరు ఆడపిల్లలకే దక్కుతుందనే కోపంతో, వారిని అడ్డు తొలగించుకోవాలని పథకం వేశాడు. ఈ క్రమంలోనే ఏమీ తెలియని ఆ పసిబిడ్డలను బావిలోకి తోసి దారుణంగా అంతమొందించాడు. ఈ ఘోరకలిని చూసి స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

Read Also:Karimnagar Crime: కవల పిల్లలను కడతేర్చిన కసాయి తండ్రి!

 Srisailam, along with his younger brother and parents, took the lives of young children.

ఐదేళ్ల వయసు ఉన్న ఇద్దరు పిల్లలను తొలుత బావిలోకి తోసేసిన శ్రీశైలం అనే వ్యక్తి.. తర్వాత తాను కూడా బావిలోకి దూకేశాడు. అయితే దూకిన తర్వాత ప్రాణ భయంతో ఈదుకుంటూ బయటకు వచ్చేశాడు. కానీ పాపం.. ఆ చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు.. బావి వద్దకు చేరుకుని గాలించారు. ఒక బాలిక మృతదేహం లభించగా.. మరో చిన్నారి మృతదేహం కోసం గాలిస్తున్నారు. ఇద్దరు కుమార్తెలను బావిలోకి తోసేసిన శ్రీశైలాన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు.

Karimnagar twins Crime updates: నిందితుల అరెస్ట్.. కుటుంబ సభ్యుల సహకారంతోనే ఘాతుకం?

ఈ జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు ప్రధాన నిందితుడు శ్రీశైలంతో పాటు, అతనికి సహకరించిన తల్లిదండ్రులను మరియు తమ్ముడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆడపిల్లల పట్ల ఉన్న చిన్నచూపే ఈ హత్యలకు ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇంటిలోని పెద్దలు కూడా ఈ నేరంలో పాలుపంచుకోవడం చూస్తుంటే, ఆ కుటుంబంలో ఆడపిల్లల పట్ల ఎంతటి ద్వేషం ఉందో అర్థమవుతోంది. పోలీసులు నిందితులందరిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

నిద్రిస్తున్న మేనకోడలిని ఎత్తుకెళ్లి దారుణం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha