Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ట్రబుల్ షూటర్ నుంచి సీఎం వరకు.. డీకే శివకుమార్ రాజకీయ ప్రస్థానం

ట్రబుల్ షూటర్ నుంచి సీఎం వరకు.. డీకే శివకుమార్ రాజకీయ ప్రస్థానం

వార్త 2 weeks ago

DK Shivakumar: నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం, ఎన్నో సవాళ్లు, మరెన్నో విజయాలతో కాంగ్రెస్ పార్టీకి ట్రబుల్ షూటర్‌గా పేరొందిన డీకే శివకుమార్ ఇప్పుడు కర్ణాటక అత్యున్నత పదవిని అధిరోహించబోతున్నారు.

ముందస్తుగా కుదిరిన అధికార మార్పిడి ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయడంతో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవికి మార్గం సుగమమైంది. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

విద్యార్థి నాయకుడి నుంచి రాష్ట్ర నాయకుడిగా

విద్యార్థి రాజకీయాల ద్వారా ప్రజాజీవితంలోకి అడుగుపెట్టిన డీకే శివకుమార్ 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి రాజకీయంగా నిరంతరం ఎదుగుతూ ఎనిమిదిసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. కనకపుర ప్రాంతంలో ఆయనకు ఉన్న బలమైన పట్టుతో 'కనకపుర బండ'గా గుర్తింపు పొందారు. పార్టీకి కష్టకాలం వచ్చినప్పుడల్లా సమస్యలను పరిష్కరిస్తూ కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగారు.

Read Also : Karnataka politics: కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా!

 DK Shivakumar

సవాళ్లను అధిగమించిన నాయకుడు

రాజకీయ జీవితంలో డీకే శివకుమార్ ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారు. మనీలాండరింగ్ ఆరోపణల కేసులో ఈడీ అరెస్ట్ చేయడంతో తిహార్ జైలులో దాదాపు 50 రోజులు గడపాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆయన వెనుకడుగు వేయలేదు. జైలు నుంచి విడుదలైన తర్వాత మరింత బలంగా రాజకీయాల్లో నిలదొక్కుకుని కేపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కీలకంగా పనిచేసి, ఉపముఖ్యమంత్రిగా గ్యారెంటీ పథకాల అమలులో ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పుడు తన రాజకీయ జీవితంలో అత్యంత కీలకమైన మైలురాయిగా ముఖ్యమంత్రి పదవిని అందుకోబోతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదు.. సిద్ధరామయ్య

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha