Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హెడ్ అవుటైన తీరుకు షాక్ అయిన అభిషేక్.. షాట్ ఒకవైపు.. బంతి మరోవైపు!

హెడ్ అవుటైన తీరుకు షాక్ అయిన అభిషేక్.. షాట్ ఒకవైపు.. బంతి మరోవైపు!

వార్త 1 week ago

Travis Head: గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ అవుటైన తీరు క్రికెట్ అందర్నీ అవాక్కయ్యేలా చేసింది.

ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన మొహమ్మద్ సిరాజ్, మొదటి బంతి నుంచే హెడ్‌ను ఇబ్బంది పెట్టాడు. వరుసగా మూడు బంతులు డాట్ అవ్వడంతో ఒత్తిడికి లోనైన హెడ్, నాలుగో బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. సిరాజ్ ప్యాడ్స్ లక్ష్యంగా వేసిన బంతిని హెడ్ లెగ్ సైడ్ వైపు బాదాలని ప్రయత్నించగా, అది బ్యాట్ ఎడ్జ్ తీసుకుని ఆఫ్ సైడ్ గాల్లోకి లేచింది. లెగ్ సైడ్ ఆడిన షాట్, ఆఫ్ సైడ్ బౌండరీ వైపు వెళ్లడం చూసి హెడ్‌తో పాటు నాన్ స్ట్రయిక్‌లో ఉన్న అభిషేక్ శర్మ నోరెళ్లబెట్టాడు.

Read Also: Pat Cummins: సన్‌రైజర్స్‌కు షాక్.. ఓటమితో పాటు ప్యాట్ కమిన్స్‌కు భారీ జరిమానా

 Abhishek was shocked by the way the head was turned out.

Travis Head: కుప్పకూలిన ఆరెంజ్ ఆర్మీ బ్యాటింగ్

సన్‌రైజర్స్ బలమంతా వారి ఓపెనింగ్ జోడీపైనే ఆధారపడి ఉంటుంది. పవర్ ప్లేలో హెడ్, అభిషేక్ శర్మ క్రీజులో ఉంటే స్కోర్ బోర్డు పరుగులు పెడుతుంది. కానీ, ఈ మ్యాచ్‌లో హెడ్ సున్నా పరుగులకే అవుటవ్వడంతో హైదరాబాద్ కోలుకోలేకపోయింది. హెడ్ నిష్క్రమణ తర్వాత వచ్చిన ఒత్తిడిలో పవర్ ప్లే ముగిసేసరికే జట్టు కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయింది. నిశాంత్ సింధూ పట్టిన అద్భుతమైన డైవింగ్ క్యాచ్‌తో హెడ్ ఇన్నింగ్స్ ముగియడం మ్యాచ్ మలుపు తిప్పిన క్షణంగా నిలిచింది.

ఆశలు ఆవిరి చేసిన మిడిల్ ఆర్డర్ వైఫల్యం

ఓపెనర్లు పెవిలియన్ చేరడంతో అంతా హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డిపైనే ఆశలు పెట్టుకున్నారు. కానీ గుజరాత్ బౌలర్ల ధాటికి వారు కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ, అవతలి వైపు వికెట్లు పడుతుండటంతో అది సాధ్యపడలేదు. 169 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించలేక, సన్‌రైజర్స్ కేవలం 86 పరుగులకే ఆలౌట్ అయింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

చెత్త రికార్డులు మూటకట్టుకున్న SRH

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha