Himachal Pradesh Road Accident: హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో భారీ రోడ్డు ప్రమాదం సంభవించింది. మస్రుంద్-హమల్ రహదారిపై ప్రయాణిస్తున్న ఒక వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలోకి దూసుకుపోయింది.
ఈ ప్రమాద తీవ్రతకు వాహనంలో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద వార్త స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
Read also: Sanchita Ugale: సుశాంత్ వర్ధంతి రోజే నటి సంచిత ఆత్మహత్య.. సోదరుడి సంచలన ఆరోపణలు
Horrific accident in Himachal Pradesh: Bolero plunges into a gorge; seven killed.
Himachal Pradesh Road Accident: వేడుక ముగించుకుని వస్తుండగా విషాదం
పోలీసులు, స్థానికులు అందించిన వివరాల ప్రకారం.. మృతులలో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. వీరంతా ఒక శుభకార్యానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చిన్నారికి ముండన్ (తలనీలాలు సమర్పించే) వేడుకను ముగించుకుని సొంత ఊరికి వస్తుండగా కాలయముడు రోడ్డు ప్రమాదం రూపంలో విరుచుకుపడ్డాడు. ప్రమాదానికి గురైన బొలెరో వాహనం కుథేడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని మహల్ గ్రామానికి చెందినదిగా అధికారులు గుర్తించారు.
సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు, స్థానికులు
ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, జిల్లా అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. లోయ చాలా లోతుగా ఉండటంతో మృతదేహాలను బయటకు తీయడానికి సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. వాహనం అదుపు తప్పడానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

