Medchal Crime: మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో సభ్య సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే ఘటన వెలుగుచూసింది. తనను పెళ్లి చేసుకోవాలని వేధించిన యువకుడిని నిరాకరించినందుకు ఒక యువతి ప్రాణం పోయింది.
కక్ష పెంచుకున్న సదరు యువకుడు బాధితురాలికి బలవంతంగా హెచ్ఐవి (HIV) సోకిన రక్తాన్ని శరీరంలోకి ఎక్కించి ఆమె మరణానికి కారణమయ్యాడు.
Read Also:Kadapa crime news : ప్రేమను నిరాకరించిందని మైనర్ బాలిక హత్య
Medchal Crime: కిరాతకానికి ఒడిగట్టిన యువకుడు
పోలీసుల విచారణ ప్రకారం.. గత నెల 11వ తేదీన నిందితుడు బాధితురాలిని పెళ్లి చేసుకోవాలని వేధించాడు. ఆమె ససేమిరా అనడంతో పగ పెంచుకున్న ఆ కిరాతకుడు, యువతిని బంధించి ప్రాణాంతకమైన హెచ్ఐవి సోకిన రక్తాన్ని ఇంజక్షన్ ద్వారా బలవంతంగా ఎక్కించాడు. వ్యాధి సోకిందని తెలియడంతో ఆ యువతి మానసిక వేదనకు గురైంది. సమాజంలో తలెత్తుకోలేనన్న భయంతో గత కొన్ని రోజులుగా నరకం అనుభవించిన బాధితురాలు, చివరకు తన ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది.
వైరల్‌గా మారిన సెల్ఫీ వీడియో.. లేఖ
ఆత్మహత్యకు ముందు యువతి రాసిన లేఖ, రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. “చేయని తప్పుకు బలి అయ్యాను.. నా క్యారెక్టరే నా గౌరవం. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారం వల్ల నా జీవితం నాశనమైంది” అని ఆమె వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది. “అమ్మానాన్న నన్ను క్షమించండి.. మరో జన్మ ఉంటే మీ కడుపులోనే పుడతా” అంటూ ఆమె రాసిన వాక్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.co
Epaper : epaper.vaartha.com
Read Also:
పెళ్లికి ఒప్పుకేలేదని మరదలికి ఎయిడ్స్ రక్తం ఎక్కించిన బావ.. యువతి ఆత్మహత్య!

