Dailyhunt
పెళ్లికి ఒప్పుకేలేదని మరదలికి ఎయిడ్స్ రక్తం ఎక్కించిన బావ.. యువతి ఆత్మహత్య!

పెళ్లికి ఒప్పుకేలేదని మరదలికి ఎయిడ్స్ రక్తం ఎక్కించిన బావ.. యువతి ఆత్మహత్య!

వార్త 1 week ago

Medchal Crime: మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన అత్యంత అమానుషం ,సభ్య సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

పెళ్లి నిరాకరించిందనే కక్షతో ఒక యువతికి బలవంతంగా హెచ్ఐవి (HIV) సోకిన రక్తాన్ని ఎక్కించి, ఆమె ఆత్మహత్యకు కారణమవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది.పోలీసుల ప్రాథమిక విచారణ, స్థానికులు తెలుపిన వివరాల ప్రకారం.

Read Also:Vijayawada: ఉగ్ర లింకుల కేసులో మరో ఆరుగురిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

Medchal Crime: పోలీసుల దర్యాప్తు

గత నెల 11వ తేదీన నిందితుడు బాధితురాలిని పెళ్లి చేసుకోవాలని వేధించాడు. ఆమె నిరాకరించడంతో, పగ పెంచుకున్న సదరు యువకుడు బాధితురాలిని బంధించి ఆమె శరీరంలోకి హెచ్ఐవి సోకిన రక్తాన్ని ఇంజక్షన్ ద్వారా బలవంతంగా ఎక్కించాడు.ప్రాణాంతక వ్యాధి సోకిందన్న వార్త ఆ యువతిని మానసికగా కుంగదీసింది. సమాజంలో తలెత్తుకోలేనన్న భయం, నిందితుడి వేధింపుల మధ్య గత కొన్ని రోజులుగా నరకం అనుభవించిన ఆమె, చివరకు తన ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు విడిచింది.

 Medchal young woman HIV blood injection case

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కేవలం పెళ్లికి ఒప్పుకోలేదన్న చిన్న కారణంతో ఇంతటి అమానుషానికి ఒడిగట్టిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోచారం పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించి, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒక యువతి ప్రాణం పోవడానికి కారణమైన ఆ కిరాతకుడికి ఉరిశిక్ష పడాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

హైదరాబాద్ లో రౌడీషీటర్లకు డ్రగ్ టెస్టులు.. 190 మందికి పాజిటివ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha