Pralhad Joshi Vijayawada Visit: కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి జూన్ 16న విజయవాడ నగరంలో విస్తృత పర్యటన చేపట్టనున్నట్లు బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ తెలిపారు.
పర్యటనలో భాగంగా ఉదయం 6 గంటలకు వన్టైన్లోని వాజ్పేయి పార్కును సందర్శించి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు మొక్కలు నాటి, స్థానిక ప్రజలతో చాయ్ పే చర్చ” నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 10 గంటలకు ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు కేంద్ర ప్రభుత్వ నిధులతో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన రాయనపాడు నూతన రైల్వే స్టేషన్ను సందర్శించి అక్కడి అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడ నగర ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సుమారు రూ.2,700 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న విజయవాడ పశ్చిమ బైపాస్ రహదారి పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
Read also: Tirupati crime: మైనర్ బాలికను గర్భవతిని చేసిన వివాహితుడు.. నిందితుడు అరెస్ట్
Union Minister Pralhad Joshi’s visit to Vijayawada
Pralhad Joshi Vijayawada Visit: బైపాస్ రహదారి పనుల పరిశీలన
మధ్యాహ్నం 12:30 గంటలకు లోటస్ ల్యాండ్్మర్లో ప్రముఖ యువ సంగీత విద్వాంసురాలు గుడిపాటి లలితని వారి నివాసంలో కలిసి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలనలో సాధించిన విజయాలను వివరిస్తూ ప్రత్యేక పుస్తకాలను అందజేస్తారు. మధ్యాహ్నం 1:15 గంటలకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ సుజనా చౌదరి గారి నివాసంలో మర్యాదపూర్వక భేటీ అవుతారు. సాయంత్రం 5 గంటలకు బెంజ్ సర్కిల్ సమీపంలోని మునిసిపల్ ఎంప్లాయీస్ కాలనీలో గల ఏ ప్లస్ కన్వెన్షన్ లో రోటరీ క్లబ్ సభ్యులు, మేధావులతో నిర్వహించే ప్రత్యేక సమావేశంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్యక్రమా విజయవంతం చేయాలన్నారు.
Epaper: epaper.vaartha.com

