Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హ్యుందాయ్ ప్రియులకు షాకింగ్ న్యూస్..భారీగా పెరగనున్న కార్ల ధరలు

హ్యుందాయ్ ప్రియులకు షాకింగ్ న్యూస్..భారీగా పెరగనున్న కార్ల ధరలు

వార్త 2 months ago

Hyundai Cars Price : సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం 'హ్యుందాయ్' కార్లను కొనుగోలు చేయాలనుకునే వారికి కంపెనీ షాకింగ్ న్యూస్ చెప్పింది.

వచ్చే నెల, అంటే జూన్ 1వ తేదీ నుంచి తమ కార్ల ధరలను భారీగా పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కార్ల మోడళ్లు, వాటి వేరియంట్లను బట్టి గరిష్టంగా రూ. 12,800 వరకు ధరల పెంపు ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. నిజానికి మే నెల నుంచే కార్ల ధరలను ఒక శాతం వరకు పెంచుతామని హ్యుందాయ్ సంస్థ ఏప్రిల్ నెలలోనే ప్రకటించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆ నిర్ణయాన్ని జూన్‌కు వాయిదా వేసింది. దీంతో కొత్త కారు కొనాలనుకునే వారు జూన్ 1 కంటే ముందే నిర్ణయం తీసుకోకపోతే అదనపు భారాన్ని మోయక తప్పని పరిస్థితి నెలకొంది.

Read Also : క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు తీస్తున్నారా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే !!

అనివార్యమైన పెంపు.. పెరిగిన ముడిసరకుల ఖర్చే కారణం!

ఈ హఠాత్తు ధరల పెంపునకు గల కారణాలను కూడా హ్యుందాయ్ యాజమాన్యం వెల్లడించింది. అంతర్జాతీయంగా ఆటోమొబైల్ రంగానికి అవసరమైన ముడిసరకుల (ఇన్‌పుట్ కాస్ట్స్) ధరలు విపరీతంగా పెరగడం, దానికి తోడు కంపెనీ నిర్వహణ వ్యయం (ఆపరేషనల్ కాస్ట్స్) భారం కావడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సంస్థ తెలిపింది. గత కొంతకాలంగా పెరుగుతున్న ఈ అదనపు ఉత్పత్తి భారాన్ని కంపెనీయే భరిస్తూ వచ్చినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ధరలను పెంచడం అనివార్యంగా మారిందని పేర్కొంది. భారతదేశంలో క్రెటా, ఐ20, వెన్యూ, ఎక్స్టర్ వంటి పాపులర్ మోడళ్లకు విపరీతమైన డిమాండ్ ఉన్న తరుణంలో, హ్యుందాయ్ తీసుకున్న ఈ నిర్ణయం మధ్యతరగతి కొనుగోలుదారులపై ఎంతో కొంత ప్రభావం చూపనుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

భారత్ లో 524 మిలియన్లుకు చేరిన జియో సబ్కైబర్ల సంఖ్య

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha