Haryana Crime: సోషల్ మీడియా వ్యామోహం కాపురాల్లో చిచ్చు పెట్టడమే కాదు, ప్రాణాలను బలిగొనే స్థాయికి చేరుకుంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం కోడలు ధరించే దుస్తుల విషయంలో తలెత్తిన వివాదం..
హర్యానాలో ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. మనస్తాపానికి గురైన అత్తమామలు ఆత్మహత్య చేసుకున్న ఈ హృదయ విదారక ఘటన పానిపట్ జిల్లాలో సంచలనం సృష్టించింది.
Read Also:Bandi Bhagirath Case: బాధితురాలి వయసుపై హైకోర్టు కీలక ప్రశ్నలు.. రేపు మధ్యంతర బెయిల్‌పై తీర్పు!
అసలేం జరిగిందంటే!
పానిపట్ జిల్లా నారా గ్రామానికి చెందిన రాజేష్ (46), సుమన్ (44) దంపతుల కుమారుడు ఆశిష్, ఢిల్లీకి చెందిన స్నేహ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2025 జనవరిలో వీరి వివాహం ఘనంగా జరిగింది. అయితే, పెళ్లికి ముందే సోషల్ మీడియాలో రీల్స్ చేసే అలవాటున్న స్నేహ.. పెళ్లి తర్వాత గ్రామీణ వాతావరణంలో కూడా పొట్టి దుస్తులు ధరించి రీల్స్ చేయడం ప్రారంభించింది.
Instagram Reels dispute suicide
కోడలి ప్రవర్తన, ఆమె ధరించే దుస్తులు నచ్చని అత్తమామలు రాజేష్, సుమన్ పలుమార్లు ఆమెను వారించారు. దీంతో కుటుంబంలో నిత్యం గొడవలు మొదలయ్యాయి. ఈ వివాదాల్లో స్నేహ పుట్టింటి వారు కూడా జోక్యం చేసుకున్నారు. స్నేహ ఆమె కుటుంబ సభ్యులతో కలిసి అత్తమామలను మానసికంగా వేధించడమే కాకుండా, వారిపై భౌతికంగా దాడి చేసినట్లు మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు.
Haryana Crime: విషం తాగి బలవన్మరణం
కోడలు , ఆమె కుటుంబ సభ్యుల వేధింపులు భరించలేక మే 9న రాజేష్, సుమన్ దంపతులు ఇంట్లోనే విషం తాగారు. గమనించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించగా.. సుమన్ ఆసుపత్రికి చేరేలోపే మృతి చెందారు. రాజేష్ రోహ్‌తక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ప్రాణాలు విడిచారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఈ ఘటనపై మృతుడు రాజేష్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కోడలు స్నేహ, ఆమె తల్లిదండ్రులు, సోదరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులు నలుగురూ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

