Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇద్దరు బిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య

ఇద్దరు బిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య

వార్త 2 months ago

Vijayawada Crime: విజయవాడ గ్రామీణ మండల పరిధిలోని పైడూరుపాడు గ్రామంలో ఈ విషాదం వెలుగుచూసింది. కవిత (34) అనే మహిళ తన కూతురు లాస్య (11), కుమారుడు సాత్విక్ (9)లను అతి కిరాతకంగా చంపి, అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Read Also:Hyderabad Crime: నువ్వు చాలా సన్నగా ఉన్నావని భర్త కామెంట్.. మనస్తాపంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన భార్య

మానసిక సమస్యే కారణమా?

స్థానికులు మరియు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, కవిత గత కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతోంది. 2015లో శ్యామ్ అనే వ్యక్తితో ఆమెకు వివాహం కాగా, భర్త లారీలు మరియు సిమెంట్ బ్రిక్స్ వ్యాపారంతో స్థిరపడ్డారు. కవిత గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమైంది. అప్పటి నుండి ఆమె ఇంటి వద్దే ఉంటున్నప్పటికీ, 2020 నుండి మానసిక సమస్యలు మొదలయ్యాయి. ఆమె ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉండేదని, తరచూ తాను చనిపోతానని చెబుతుండేదని సమాచారం.

Vijayawada Crime: క్షణికావేశంలో దారుణం

తాను చనిపోతే తన పిల్లలను ఎవరూ సరిగ్గా చూసుకోరనే ఆందోళన ఆమెను ఈ దారుణానికి పురికొల్పినట్లు తెలుస్తోంది. నిద్రిస్తున్న పిల్లల మెడకు చున్నీ బిగించి వారిని హతమార్చిన కవిత, ఆపై తాను కూడా ఉరి వేసుకుని ప్రాణాలు విడిచింది. సాయంత్రం వ్యాపారం ముగించుకుని ఇంటికి వచ్చిన భర్త శ్యామ్, విగతజీవులుగా పడి ఉన్న భార్యాపిల్లలను చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఒక నిండు కుటుంబం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం ఊరి జనాన్ని కలచివేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

టీసీఎస్ నిదా ఖాన్ పరారీ.. పోలీసుల రాకను పసిగట్టి చాకచక్యంగా ఎస్కేప్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha