Nashik TCS Case updates: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాసిక్ టీసీఎస్ లైంగిక వేధింపులు, మతమార్పిడి కేసులో ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ పోలీసులకు చుక్కలు చూపిస్తోంది.
ఆమె ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్న తరుణంలో, ఆమె తన నివాసం నుంచి తప్పించుకోవడంతో ఈ కేసులో మరో ఉత్కంఠభరిత మలుపు చోటుచేసుకుంది. పోలీసులు వస్తున్నారనే విషయాన్ని ముందే పసిగట్టిన నిదా ఖాన్ అక్కడి నుంచి చాకచక్యంగా పరారైనట్లు తెలుస్తోంది.
Read also: Anudeep Arrested: పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు… అనుదీప్ అరెస్ట్
Nashik TCS Case updates: TCS Nida Khan absconds.. Sensing the arrival of the police, she cleverly escaped!
భర్త సమాచారం ఇచ్చినా.. అవాక్కైన పోలీసులు
విచారణలో భాగంగా పోలీసులు నిదా ఖాన్ భర్తను ప్రశ్నించగా, ఆయన పోలీసులకు సహకరించి ఆమె ఉంటున్న లొకేషన్‌ను వెల్లడించారు. ఆ సమాచారం ఆధారంగా పోలీసులు తక్షణమే అక్కడికి చేరుకున్నారు. కానీ, వారు వెళ్లేసరికే ఆ ఇంటికి తాళం వేసి ఉండటంతో అధికారులు విస్తుపోయారు. తనను పట్టుకునేందుకు పోలీసులు వస్తున్నారని గ్రహించిన నిదా ఖాన్, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడి నుంచి మాయమైంది. ప్రస్తుతం ఆమె కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
Nashik TCS Case updates: తీవ్ర ఆరోపణలు.. 9 ఎఫ్ఐఆర్లు
టీసీఎస్‌లో పనిచేసిన నిదా ఖాన్ పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. టీమ్ లీడర్లు మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తున్నా పట్టించుకోకపోగా, బాధితులనే భయపెట్టి నిందితులకు అండగా నిలిచిందని ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఇస్లాంలోకి మారాలంటూ తీవ్ర ఒత్తిడి తెచ్చిందని, ఇది పథకం ప్రకారం జరిగిన కుట్ర అని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుల ఫిర్యాదుల మేరకు ఇప్పటికే పోలీసులు 9 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. వేధింపులకు పాల్పడిన టీమ్ లీడర్లను అరెస్ట్ చేయగా, ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న నిదా ఖాన్ కోసం గాలింపు ముమ్మరం చేశారు.
ప్రస్తుతం నిదా ఖాన్ పొరుగు రాష్ట్రాల్లో తలదాచుకున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు, ఆమెకు ఎవరైనా ఆశ్రయం కల్పిస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ క్రైమ్ విభాగం కూడా ఆమె డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఆధారంగా వేట కొనసాగిస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

