Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సన్నగా ఉన్నావని భర్త కామెంట్.. ఆ తరువాత భార్య ఏం చేసిందో తెలుసా!

సన్నగా ఉన్నావని భర్త కామెంట్.. ఆ తరువాత భార్య ఏం చేసిందో తెలుసా!

వార్త 2 months ago

Hyderabad Crime: దంపతుల మధ్య గొడవలు రావడం కామన్. కానీ, కూకట్‌పల్లి శంషిగూడలో జరిగిన ఒక ఘటన మాత్రం పోలీసులనే విస్మయానికి గురిచేసింది. భర్త అన్న చిన్న మాటను మనసులో పెట్టుకున్న ఓ భార్య, చెప్పా పెట్టకుండా ఇల్లు వదిలి వెళ్లిపోయింది.

Read Also:Aminpur STP Plant Protest: అమీన్‌పూర్‌లో ఎస్టీపీ ప్లాంట్‌పై ఉద్రిక్తత

Hyderabad Crime: ఘటన నేపథ్యం

శంషిగూడకు చెందిన శివ కుమార్, రాజేశ్వరి దంపతులు. రాజేశ్వరి కాస్త సన్నగా ఉండటంతో, ఆమె ఆరోగ్యం మీద శ్రద్ధతో శివ కుమార్ ఒక మాట అన్నాడు.అయితే, భర్త తన మంచి కోరి చెప్పినా.. రాజేశ్వరి మాత్రం ఆ మాటను ఒక అవమానంగా భావించింది. తను సన్నగా ఉన్నాననే విషయాన్ని ఎత్తి చూపడం ఆమెకు నచ్చలేదు.”నువ్వు చాలా సన్నగా ఉన్నావు, కొంచెం పెరుగు తినడం అలవాటు చేసుకో.. అప్పుడైనా కొంచెం ఒళ్లు వస్తుంది” అని సరదాగా సూచించాడు.

 KPHB missing case wife leaves home over curd comment

పోలీసుల విచారణ

తీవ్ర మనస్తాపానికి గురైన రాజేశ్వరి, బుధవారం సాయంత్రం ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. చీకటి పడుతున్నా ఆమె ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన శివ కుమార్, చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో గాలించాడు. ఎక్కడా ఆమె ఆచూకీ దొరకకపోవడంతో కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.శివకుమార్ ఫిర్యాదుతో పోలీసులు ‘మిస్సింగ్ కేసు’ నమోదు చేశారు. రాజేశ్వరి ఇంటి నుంచి బయటకు వెళ్ళిన సమయంలో ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆమె ఎటు వెళ్లి ఉంటుంది? ఎక్కడ ఉంది? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్: కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha