Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇద్దరు కుమారులకు ఉరివేసి తండ్రి ఆత్మహత్య! ఆ ఇంట్లో అసలేం జరిగింది?

ఇద్దరు కుమారులకు ఉరివేసి తండ్రి ఆత్మహత్య! ఆ ఇంట్లో అసలేం జరిగింది?

వార్త 1 month ago

Mahabubabad crime: మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో ఒక తండ్రి అమానుషంగా ప్రవర్తించాడు. తన ఇద్దరు కుమారులను ఉరివేసి చంపడమే కాకుండా అతను కూడా ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

ఈ ఘటన స్థానికంగా అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. చిన్నపిల్లల ప్రాణాలు పోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read also: Karnataka Bus Accident: చిత్రదుర్గలో బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు

 Father and two sons death case update

Mahabubabad crime: ప్రాణాలు తీసిన కుటుంబ గొడవలు

కుటుంబంలో జరిగిన గొడవల వల్లే ఈ ఘోరం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయా లేక ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. ఇంటి యజమానే ఇలా చేయడంతో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

కేసు నమోదు చేసి పోలీసుల విచారణ

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఆత్మహత్యకు ముందు ఏవైనా లేఖలు రాశారా అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అభం శుభం తెలియని చిన్నారులను చంపడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు విచారణ తర్వాత వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా సామాజిక అవగాహన పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

పెళ్లి భోజనం తిన్నారు.. 20 మందికి అస్వస్థత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha