Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇద్దరు కుమారులను చంపి తల్లి ఆత్మహత్య

ఇద్దరు కుమారులను చంపి తల్లి ఆత్మహత్య

వార్త 2 months ago

Kukatpally crime: హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గుండెల్ని పిండేసే ఘటన వెలుగులోకి వచ్చింది. కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో నివాసముంటున్న ఒక మహిళ తన ఇద్దరు చిన్నారి కుమారులను దారుణంగా హతమార్చి, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలింది.

ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

Read Also :Mumbai Crime: తండ్రిపై కక్షతో నాలుగేళ్ల బాలుడిని నేలకేసి కొట్టిన కిరాతకుడు

వరంగల్ జిల్లాకు చెందిన కుటుంబం.. దర్యాప్తులో పోలీసులు

మృతురాలు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడ మాణిక్యం తండాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన ఈ కుటుంబంలో ఇటువంటి విషాదం చోటుచేసుకోవడం అందరినీ కలిచివేస్తోంది. తల్లి తన సొంత పిల్లలను చంపడానికి, ఆపై తాను బలవన్మరణానికి పాల్పడటానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులా లేక కుటుంబ కలహాలా అనే కోణంలో విచారణ సాగుతోంది.

 Woman in Warangal District Takes Drastic Step; Three Dead.

Kukatpally crime: ఆత్మహత్యకు గల కారణాలపై అన్వేషణ

ఘటనా స్థలాన్ని పరిశీలించిన క్లూస్ టీమ్ మరియు పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కూకట్‌పల్లి పోలీసులు, మృతురాలి భర్త మరియు బంధువులను విచారిస్తున్నారు. చిన్న వయసులోనే చిన్నారుల ప్రాణాలు పోవడం పట్ల కాలనీవాసులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

నేవీ ఉద్యోగి 'హంతకుడు'గా మారిన కథ..హత్య కేసులో సంచలన నిజాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha