Mumbai Crime: ముంబై సమీపంలోని వసాయిలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది.. వ్యక్తుల మధ్య ఉన్న గొడవలు పసి ప్రాణాల మీదకు వస్తున్నాయి. ఓ వ్యక్తితో జరిగిన చిన్న వివాదాన్ని మనసులో పెట్టుకున్న దుండగుడు, అతని నాలుగేళ్ల కుమారుడిపై అత్యంత క్రూరంగా ప్రతీకార దాడికి పాల్పడ్డాడు.
Read Also : Sweden Pelicot Case: భర్త పైశాచికత్వం! డబ్బు కోసం భార్యను 120 మందికి అమ్మేసిన ఘనుడు
Maniac beats four-year-old boy to the ground with a stick
Mumbai Crime: ఇనుప రాడ్డుకు తలను బాది..
వివరాల్లోకి వెళితే.. వసాయిలోని ఒక హౌసింగ్ సొసైటీలో విఘ్నేశ్ అనే నాలుగేళ్ల బాలుడు స్నేహితులతో కలిసి ఆటోరిక్షాలో ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో బాలుడి తండ్రితో చిన్న విషయంలో గొడవపడిన సందీప్ పవార్ అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఆటోలో ఉన్న విఘ్నేశ్‌ను కాళ్లు పట్టుకుని బయటకు లాగి, ఏమాత్రం కనికరం లేకుండా ఒక్కసారిగా నేలకేసి కొట్టాడు. అంతటితో ఆ రాక్షసుడి ఆగ్రహం చల్లారలేదు. బాలుడిని లాక్కెళ్లి ఇనుప రాడ్డుకు పసివాడి తలను బలంగా బాదాడు. ఆ తర్వాత మళ్లీ బాలుడిని నేలకేసి కొట్టాడు. ఈ అమానుష దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు.
ఐసీయూలో చిన్నారి పరిస్థితి విషమం
తీవ్ర గాయాలపాలైన విఘ్నేశ్‌ను కుటుంబ సభ్యులు వెంటనే మీరా రోడ్డులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని, బాలుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. తలకు తీవ్రమైన దెబ్బలు తగలడంతో బాలుడు మృత్యువుతో పోరాడుతున్నాడు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

