Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇదేం అన్యాయం! పుట్టింటికి వెళ్తానన్న భార్య ముక్కు కోసిన భర్త

ఇదేం అన్యాయం! పుట్టింటికి వెళ్తానన్న భార్య ముక్కు కోసిన భర్త

వార్త 3 weeks ago

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో నమ్మశక్యం కాని ఒక దారుణ సంఘటన వెలుగుచూసింది. కేవలం పుట్టింటికి వెళ్లే విషయంలో మొండికేసిందన్న కారణంతో ఒక భర్త తన భార్య ముక్కు కోసేశాడు.

అయితే, అంతటితో ఆగని ఈ గొడవ మరింత ముదిరి.. భార్య తరఫు బంధువులు వచ్చి ప్రతీకారంగా భర్త సోదరి (ఆడపడుచు) ముక్కును కూడా కోసేసిన వింత ఘోరం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Read Also: Tripuranthakam tragedy: చెరువులో ఈతకు వెళ్లి శవమై వచ్చాడు

Uttar Pradesh: పెళ్లికి వెళ్తానన్నందుకే ముక్కు కోసేసిన భర్త

బాధిత భార్య ప్రీతి తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తన కజిన్ సోదరి వివాహ వేడుక ఉండటంతో తాను పుట్టింటికి వెళ్తానని భర్త శ్రావణ్‌తో చెప్పింది. అయితే అందుకు భర్త నిరాకరించాడు. అయినప్పటికీ ప్రీతి పుట్టింటికి వెళ్లాల్సిందేనని పట్టుబట్టడంతో ఆగ్రహంతో ఊగిపోయిన శ్రావణ్, భార్యపై దాడి చేసి బ్లేడు తో ఆమె ముక్కును కోసేశాడు.

పళ్లతో దాడి చేసి.. ఆడపడుచుపై ప్రతీకారం!

భర్త దాడిలో ప్రీతి ముక్కు తెగి రక్తసిక్తమవడంతో ఈ సమాచారం ఆమె పుట్టింటి బంధువులకు తెలిసింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రీతి కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున శ్రావణ్ ఇంటిపైకి దూసుకొచ్చారు. అక్కడ శ్రావణ్‌కు బుద్ధి చెప్పే క్రమంలో.. ప్రతీకారంగా అతని సోదరి అయిన మోనిపై పళ్లతో అత్యంత కిరాతకంగా దాడి చేశారు. అనంతరం ఆమె ముక్కును కూడా దారుణంగా కోసేశారు. ఈ వికృత ఘర్షణ అనంతరం ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తీవ్రంగా గాయపడిన భార్య ప్రీతి, భర్త సోదరి మోని ఇద్దరినీ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ముక్కుల వేట కేసుపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.

Epaper: epaper.vaartha.com

భర్త తలపై మొబైల్‌తో భార్య దాడి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha