Telangana Intermediate: ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇకపై ఇంటర్మీడియట్లో సైన్స్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ) విద్యార్థులకు మొదటి సంవత్సరంలో ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించనున్నారు.
గతం హ్యూమానిటీస్, ఇంటర్నల్ అసెస్ మెం టన్ను నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. వీటిని 2026-27 విద్యా సంవత్సరం నుంచే అమలు చేయనున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ గురువారం ప్రకటనలో తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు సిలబస్లో మార్పులు చేశా మని, మారిన సిలబస్కి సంబంధించిన పుస్తకాలను జూన్ 1 నాటికి విద్యార్థులకు అందజేయ నున్నట్టు బోర్డు సెక్రటరీ ప్రకటనలో స్పష్టం చేశారు.
Read Also: Telangana Agriculture: రైతు సంక్షేమంపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదు.. మంత్రి తుమ్మల
Practical exams in Inter First Year too
Telangana Intermediate: సైన్స్, మ్యాథ్స్ విభాగాల్లో మార్పులు
ఇంటర్మీడియట్ ఫస్టియర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీకి ప్రాక్టికల్స్ను నిర్వహించి వార్షిక పరీక్షల సమయంలో ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఫస్టియర్లో 15 మార్కులు, మార్కులు కేటాయిం చనున్నారు. మ్యాక్స్లోనూ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ *”(ఏబిఎల్)ను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా మ్యాథ్స్ లో 75 మార్కులకు బదులు 60 మార్కులకు ఫైనల్ థియరీ పరీక్షలను నిర్వహించనుండగా.. ఇంటర్నల్ అసెస్మెంట్కు ఒక్కో ఏడాదికి 15 మార్కులను కేటా యించనున్నారు.
2026-27 విద్యా సంవ త్సరం నుంచే కొత్త విధానం
అలాగే హ్యుమానిటీస్లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్కు 20 మార్కులను కేటాయిస్తారు. ఫైనల్ ధియరీ పరీక్షలను ఇకపై 100 మార్కులకు బదులుగా 80 మార్కులకే నిర్వహించ నున్నారు. భాషా విభాగా ల్లోనూ థియరీకి 100 మార్కులకు బదులుగా ఇకపై 80 మార్కులకు వార్షిక పరీక్షలకి నిర్వహించనుండగా.. 20మార్కులు ఇంటర్నల్ అసెస్మెంట్కు కేటాయించనున్నట్లు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఈ మార్పు లను 2026-27 విద్యా సంవ త్సరం నుంచే అమలు చేయనున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి సోమవారం ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ నెల 12 నుంచి ఇంటర్ ఆడ్మిషన్లకు అనుమతించిన నేపథ్యంలో ఇంటర్ విద్యలో మార్పులను ఇంటర్ బోర్డు ప్రకటించింది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

