Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇంధన నిల్వలపై కేంద్రం నజర్.. విమాన ఇంధనం, డీజిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు!

ఇంధన నిల్వలపై కేంద్రం నజర్.. విమాన ఇంధనం, డీజిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు!

వార్త 2 months ago

Fuel Shortage: పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రమంలో దేశీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అంతర్జాతీయ చమురు మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి.

Read Also:Jag Vikram LPG Tanker: హర్మూజ్ జలసంధిని దాటిన భారత ట్యాంకర్

ముడి చమురు ధరలు నిరంతరం పెరుగుతుండటంతో, దేశీయంగా ఇంధన కొరత తలెత్తకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా దేశీయ చమురు సంస్థలు విదేశాలకు ఎగుమతి చేసే డీజిల్, విమాన ఇంధనం (ATF) పై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

 Windfall Tax Hike India

Fuel Shortage: డీజిల్, విమాన ఇంధనంపై కొత్త సుంకాలు

ఎగుమతులపై విధించే సుంకాలను కేంద్రం ఈ క్రింది విధంగా సవరించింది. గతంలో లీటరు డీజిల్‌పై రూ. 21.5 గా ఉన్న సుంకాన్ని ఏకంగా రూ. 55.5 కి పెంచారు. అంటే లీటరుకు సుమారు రూ. 34 మేర భారం పెరిగింది.విమాన ఇంధనంపై గతంలో ఉన్న రూ. 29.5 సుంకాన్ని రూ. 42 కి పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

జేఈఈ మెయిన్-2026 'కీ' విడుదల: మీ స్కోర్‌ను ఇలా చెక్ చేసుకోండి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha