JEE Main 2026 Answer Key Released: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్-2026 సెషన్-1 పరీక్షల ఫలితాల దిశగా కీలక అడుగు పడింది.
పరీక్షకు హాజరైన లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు తెరదించుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రొవిజనల్ ఆన్సర్ కీని అందుబాటులోకి తెచ్చింది. జేఈఈ అధికారిక వెబ్‌సైట్‌లో ‘కీ’ చెక్ చేసుకోవచ్చు.
Read Also: Telangana Inter Results: వాట్సాప్‌లోనే ఇంటర్ ఫలితాలు.. నంబర్ ఇదే!
JEE Main 2026 Answer Key Released: కీలక తేదీలు, వివరాలు
జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షలు బుధవారం (ఏప్రిల్ 8)తో ముగిశాయి. ఏప్రిల్ 7వ తేదీన పేపర్ 2 ఏ, 2బీ (బీఆర్క్, బీప్లానింగ్) పరీక్షలు జరిగాయి. చివరి రోజున కేవలం రెండో షిఫ్టులో మాత్రమే పరీక్షలు జరిగాయి. దేశ వ్యాప్తంగా సుమారు 11.23 లక్షల మంది విద్యార్ధులకు 566 పరీక్ష కేంద్రాల్లో 318 నగరాల్లో ఈ పరీక్షలు జరిగాయి.
JEE Main 2026 Answer Key
ఇందులో పేపర్ 1 (బీఈ/బీటెక్) పరీక్షకు సుమారు 11.06 లక్షల మంది భారతీయ విద్యార్ధులు రాశారు. ఇక విదేశాలకు చెందిన విద్యార్ధులు 4,229 మంది రిజిస్టర్ చేసుకోగా.. ఇందులో 93 శాతం పరీక్షలకు హాజరయ్యారు. పేపర్ 2 (బీఆర్క్/బీప్లానింగ్) పరీక్షకు దాదాపు 55 వేల మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. ఇందులో 73 శాతం మంది విద్యార్ధులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 6 రోజుల్లో 10 సెషన్లలో ఈ పరీక్షలు జరిగాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

