Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇందిరమ్మ ఇళ్లకు మరోసారి లాటరీ? ఈ 2 నియోజకవర్గాల వారికి గుడ్‌న్యూస్

ఇందిరమ్మ ఇళ్లకు మరోసారి లాటరీ? ఈ 2 నియోజకవర్గాల వారికి గుడ్‌న్యూస్

వార్త 1 week ago

Indiramma House Lottery: హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కీలక సమాచారం. నగరంలోని పలు నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది.

ఇప్పటికే లాటరీ ద్వారా ఎంపికైన దరఖాస్తుదారుల వివరాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఈ తనిఖీల్లో కొన్ని నియోజకవర్గాల్లో స్థానికుల సంఖ్య ఇళ్ల కేటాయింపునకు సరిపడా లేకపోవడంతో మరోసారి లాటరీ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also :Double Bedroom Houses: ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. వారం రోజుల్లో ఇంట్లోకి రాకపోతే కేటాయింపు రద్దు

ఇబ్రహీంపట్నం, ఖైరతాబాద్‌లో మరో డ్రా?

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఒక్కో నియోజకవర్గానికి 600 మంది చొప్పున ఎంపిక చేశారు. ఇందులో 480 మందిని ప్రధాన జాబితాలో, మరో 120 మందిని వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉంచారు. ఎంపికైన వారి వివరాలపై అధికారులు క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియలో ఇబ్రహీంపట్నం, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో ఇళ్ల కేటాయింపునకు అవసరమైన స్థాయిలో స్థానికులు లేరని గుర్తించినట్లు సమాచారం. దీంతో అక్కడ మిగిలిపోయే ఇళ్లను స్థానికులుగా నిర్ధారణైన అర్హులైన దరఖాస్తుదారులకు కేటాయించేందుకు మరోసారి లాటరీ నిర్వహించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

కూకట్‌పల్లిలోనూ అభ్యంతరాలు

కూకట్‌పల్లి నియోజకవర్గంలో కూడా స్థానికులు కానివారు ఎంపికయ్యారంటూ అభ్యంతరాలు వచ్చినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఇళ్ల సంఖ్యకు సరిపడా స్థానిక దరఖాస్తుదారులు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ తుది పరిశీలనలో స్థానికుల సంఖ్య సరిపోకపోతే కూకట్‌పల్లిలోనూ అదనంగా డ్రా నిర్వహించే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నట్లు సమాచారం.

ఎంపిక కాని వారికి రూ.10 వేల రిఫండ్

ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో చెల్లించిన రూ.10,000 మొత్తాన్ని ఎంపిక కాని దరఖాస్తుదారులకు తిరిగి చెల్లించనున్నారు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో లబ్ధిదారుల తుది జాబితా ఇంకా ఖరారు కాలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో రిఫండ్ ప్రక్రియ పూర్తికాలేదని అధికారులు వెల్లడించినట్లు సమాచారం. తుది జాబితా ఖరారైన తర్వాత రిఫండ్ ప్రక్రియ ముందుకు సాగే అవకాశం ఉంది.

ఈ నెల 25 వరకు అప్లికేషన్ సవరణకు అవకాశం

దరఖాస్తు సమయంలో నియోజకవర్గ వివరాలను తప్పుగా నమోదు చేసిన వారికి ప్రభుత్వం సవరణకు అవకాశం కల్పించింది. ఈ నెల 25 వరకు ఆన్‌లైన్‌లో వివరాలను మార్చుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అప్లికేషన్ వివరాలు, మొబైల్ నంబర్ లేదా ఆధార్ వివరాలతో లాగిన్ అయి అవసరమైన మార్పులు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తుదారులు తమ వివరాలను మరోసారి పరిశీలించుకోవడం మంచిది.

Indiramma House Lottery: ఎంపికైన వారికి అలాట్‌మెంట్ లెటర్లు

ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు ఎంపికైన లబ్ధిదారులకు త్వరలో వాట్సాప్, ఎస్‌ఎంఎస్ ద్వారా అలాట్‌మెంట్ లెటర్లు పంపించనున్నారు. అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా అలాట్‌మెంట్ లెటర్లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలంగాణ హౌసింగ్ బోర్డు తెలిపింది. ఇప్పటికే ఎంపికైన లబ్ధిదారుల వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత తుది జాబితా ఆధారంగా ఇళ్ల కేటాయింపు ప్రక్రియ కొనసాగనుంది.

లబ్ధిదారులకు అలాట్‌మెంట్ లెటర్లు.. నేటి నుంచే పంపిణీ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha