Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఖర్గే ..ఆరేళ్ల వయసులో దారుణం జరిగింది !!

ఖర్గే ..ఆరేళ్ల వయసులో దారుణం జరిగింది !!

వార్త 3 weeks ago

Mallikarjun Kharge : రాజకీయాల్లో ఎన్నో శిఖరాలను అధిరోహించిన కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే జీవితంలో ఎవరికీ తెలియని ఒక చీకటి కోణం, గుండెను పిండేసే విషాద గాథ ఉంది.

ఆయన కేవలం ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు జరిగిన ఒక దారుణ సంఘటన ఆయన జీవితాన్నే మార్చేసింది. సీనియర్ న్యాయవాది, రాజకీయ నాయకుడు కపిల్ సిబల్ నిర్వహించిన ముఖాముఖిలో ఖర్గే తన గతాన్ని గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. హైదరాబాద్ సంస్థాన విలీన సమయంలో రజాకార్లు సాగించిన దాడులు, అరాచకాలు ఖర్గే కుటుంబాన్ని నిలువునా ముంచేసాయి. కర్ణాటకలోని ఆయన స్వగ్రామమైన వరవట్టి (అప్పటి హైదరాబాద్ సంస్థాన పరిధిలోని ప్రాంతం) లో రజాకార్లు జరిపిన బీభత్సం సామాన్యమైనది కాదు. ప్రధాన రహదారికి కాస్త దగ్గరగా ఉన్న ఖర్గే నివాసాన్ని లక్ష్యంగా చేసుకున్న రజాకార్లు, దానికి క్రూరంగా నిప్పు పెట్టారు.

Read Also : టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ.. సీఎం విజయ్‌పై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

ప్రాణాలతో బయటపడ్డ మల్లికార్జున.. అడవి బాట పట్టిన వైనం

ఈ ఘోర అగ్నిప్రమాదంలో మల్లికార్జున ఖర్గే కళ్ల ముందే ఆయన తల్లి, సోదరుడు, సోదరి మరియు బాబాయి సజీవ దహనమయ్యారు. ఆ సమయంలో ఖర్గే ఇంటి బయట ఆడుకుంటూ ఉండటం వల్ల మాత్రమే తృటిలో ప్రాణాలతో బయటపడగలిగారు. కంటి ముందే కన్నతల్లి, తోబుట్టువులు అగ్నికి ఆహుతైపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆ చిన్నారి గుండె ఎంతలా రోదించి ఉంటుందో ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ దారుణ ఊచకోత నుండి ఎలాగోలా తప్పించుకున్న ఖర్గే మరియు ఆయన తండ్రి, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సమీపంలోని అటవీ ప్రాంతానికి పారిపోయారు. అక్కడ చాలా రోజుల పాటు తలదాచుకుని, ఆకలి నకనకలతో, భయాందోళనల మధ్య కాలం గడిపారు. ఒక సామాన్య బాలుడిగా ఇంతటి భయానక వాతావరణాన్ని, వ్యక్తిగత నష్టాన్ని తట్టుకుని, నేడు దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఎదిగిన ఖర్గే ప్రస్థానం నిజంగా ఎందరికో స్ఫూర్తిదాయకం.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

TMCలో కీలక పరిణామం !

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha