Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పార్లమెంట్లో మహిళా బిల్లుపై ఎమ్మెల్యే పరిటాల సునీత హర్షం

పార్లమెంట్లో మహిళా బిల్లుపై ఎమ్మెల్యే పరిటాల సునీత హర్షం

వార్త 2 months ago

Paritala Sunita on Women's Bil: పార్లమెంట్ లో మహిళా బిల్లు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ చెందిన మహిళా ఎమ్మెల్యేలు, ఎంపీలు గురువారం సంతోషంతో ఢిల్లీలో సందడి చేశారు.

ఎంపీల ఇళ్లల్లో విందు చేయడంతో పాటు ముఖ్య నేతలను కలుసుకున్నారు. అందులో భాగంగా రాయలసీమ జిల్లాలకు చెందిన మహిళా ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్లో మహిళా నారీ శక్తి వందన్ అధినియం బిల్లు ప్రవేశపెట్టడం.. దేశంలో యావత్ మహిళాలోకం గర్వించే రోజుగా నిలిచిపోతుందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అభివర్ణించారు.

Read Also: Telangana Brand Global: తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తం

Paritala Sunita on Women’s Bil: చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్.. చారిత్రక ఘట్టం

మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెడుతున్న నేపథ్యంలో ఆమె సహచర మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. ఇందులో భాగంగానే గురువారం ఉదయం ఢిల్లీలోని ఎంపీ లావు కృష్ణదేవరాయలు నివాసంలో అల్పాహారం విందుకు హాజరయ్యారు. ఆ తర్వాత పార్లమెంట్ ఆవరణంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో భేటీ అయ్యారు. మంత్రి సీతారామన్ అందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరించారు. మహిళా బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో తమ ఆనందాన్ని పంచుకున్నారు.

ముఖ్య నేతలతో భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఎమ్మెల్యే పరిటాల సునీత సహచర ప్రజాప్రతినిధులతో కలిశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే సునీతను ఆప్యాయంగా పలకరిస్తూ కుటుంబ యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత సాయంత్రం మంత్రి పెమ్మసాని నివాసంలో జరిగిన అల్పాహార విందులో పాల్గొన్నారు. ఆ తర్వాత కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు నివాసానికి వెళ్లారు. అక్కడ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆత్మీయ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా బిల్లు ప్రవేశపెట్టడం తమ కళ్లారా చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ చారిత్రక ఘట్టానికి మేము కూడా సాక్షులు అవుతుండడం గర్వంగా ఉందన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఎస్సార్ మ్యాపింగ్‌పై బిఎల్ఓలకు శిక్షణ కార్యక్రమం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha