Infosys US Acquisition: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన గ్లోబల్ విస్తరణలో భాగంగా అమెరికాకు చెందిన రెండు కీలక టెక్నాలజీ సంస్థలను కొనుగోలు చేస్తూ భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
హెల్త్‌కేర్, ఇన్సూరెన్స్ రంగాల్లో తన పట్టును పెంచుకునేందుకు ఈ రెండింటిపై సుమారు $560 మిలియన్ల (దాదాపు ₹5,270 కోట్లు) పెట్టుబడి పెడుతోంది.డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ మరియు నిర్దిష్ట పరిశ్రమల (Industry-specific) విభాగాల్లో తన సామర్థ్యాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ఇన్ఫోసిస్ ఈ అడుగు వేసింది.
Read Also:Bangalore, Hyderabad: బెంగళూరు, హైదరాబాద్ మధ్య పోటీ..రెండింట్లో సిలికాన్ వ్యాలీ ఏది?
Infosys US Acquisition: ఆప్టిమమ్ హెల్త్‌కేర్ ఐటీ (Optimum Healthcare IT)
ఈ రెండు ఒప్పందాలలో అత్యంత కీలకమైనది ‘ఆప్టిమమ్ హెల్త్‌కేర్ ఐటీ’. ఫ్లోరిడా కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ కోసం ఇన్ఫోసిస్ 465 మిలియన్ డాలర్లు వెచ్చిస్తోంది. హెల్త్‌కేర్ కన్సల్టింగ్ అండ్ డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో ఆరితేరిన ఈ సంస్థకు 1,600 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ విభాగంలో ఈ సంస్థకు ఉన్న నైపుణ్యం ఇన్ఫోసిస్ హెల్త్‌కేర్ విభాగం ఆదాయాన్ని భారీగా పెంచనుంది. ఈ సంస్థ ఆదాయం కేవలం ఏడాది కాలంలోనే 106 మిలియన్ డాలర్ల నుంచి 275 మిలియన్ డాలర్లకు పెరగడం ఇన్ఫోసిస్ ను ఆకర్షించింది.
Infosys acquisition of Optimum Healthcare IT
స్ట్రాటస్ (Stratus Global LLC)
ఇక రెండో సంస్థ ‘స్ట్రాటస్’ను 95 మిలియన్ డాలర్లకు ఇన్ఫోసిస్ దక్కించుకుంది. న్యూజెర్సీకి చెందిన ఈ టెక్నాలజీ కన్సల్టింగ్ సంస్థ ఇన్సూరెన్స్ రంగంలో, ముఖ్యంగా ప్రాపర్టీ అండ్ క్యాజువల్టీ విభాగంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. 450 మంది నిపుణులు కలిగిన ఈ సంస్థ.. గైడ్‌వైర్ సంబంధిత సేవలు, క్లౌడ్ మైగ్రేషన్‌లో ఇన్ఫోసిస్ సామర్థ్యాన్ని మరింత పెంచనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

