Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సర్వే అంచనాలు: ఎవరికి ఎన్ని సీట్లు?

సర్వే అంచనాలు: ఎవరికి ఎన్ని సీట్లు?

వార్త 3 months ago

Tamil Nadu Election Survey 2026: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం క్లైమాక్స్‌కు చేరుకుంది. 234 స్థానాలున్న ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. ఏప్రిల్ 23, 2026న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, 'ఓట్‌వైబ్' (Vote Vibe) సంస్థ నిర్వహించిన తాజా 'ఓట్‌ట్రాకర్‌' సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి.'ఓట్‌వైబ్' ఓట్‌ట్రాకర్‌ సర్వే ప్రకారం ప్రధాన కూటముల బలాబలాలు ఇలా ఉన్నాయి:

Read Also:Bangalore, Hyderabad: బెంగళూరు, హైదరాబాద్ మధ్య పోటీ..రెండింట్లో సిలికాన్ వ్యాలీ ఏది?

Tamil Nadu Election Survey 2026: సర్వేలోని కీలక అంశాలు

తాజా సర్వే ప్రకారం.. అధికార డీఎంకే కూటమి 113 నుంచి 123 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది. అంటే, మెజారిటీ మార్కుకు అతి చేరువలో డీఎంకే నిలిచింది. మరోవైపు ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమి కూడా తక్కువ తినలేదు; వీరు 106 నుంచి 116 స్థానాల్లో జయకేతనం ఎగురవేసే ఛాన్స్ ఉందని సర్వే అంచనా వేసింది. ఇరు కూటముల మధ్య కేవలం కొన్ని సీట్ల తేడా మాత్రమే ఉండటంతో, ప్రతి ఓటు ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది.

 Tamil Nadu Assembly Election 2026 Survey Results

విజయ్ TVK ప్రభావం

తొలి ప్రయత్నంలోనే విజయ్ పార్టీ 2 నుంచి 8 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది.డీఎంకే, ఏఐఏడీఎంకే కూటముల మధ్య స్వల్ప సీట్ల తేడా ఉన్న నేపథ్యంలో, విజయ్ గెలుచుకునే ఈ కొన్ని సీట్లే తదుపరి ప్రభుత్వాన్ని నిర్ణయించే శక్తిగా మారనున్నాయి.ప్రస్తుత డీఎంకే ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉంది. వీరు భారీగా విజయ్ (TVK) వైపు ఆకర్షితులవుతున్నారు.ఎడప్పాడి పళనిస్వామి (AIADMK) నాయకత్వాన్ని కోరుకుంటున్నారు.ఇప్పటికీ ముఖ్యమంత్రి స్టాలిన్ (DMK) పాలన పట్ల సానుకూలంగా ఉన్నారు.

ఐదేళ్ల డీఎంకే పాలనపై 40 శాతం మంది సానుకూలంగా ఉంటే, 39 శాతం మంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సర్వే స్పష్టం చేసింది.ఏ రాజకీయ పార్టీకైనా భవిష్యత్తు వారధులు యువతే. కానీ, తాజా సర్వే ప్రకారం యువత ఆదరణలో డీఎంకే వెనకబడి ఉండటం ఆ పార్టీకి పెద్ద మైనస్‌గా మారే ప్రమాదం ఉంది. మహిళా ఓటర్ల మద్దతు మెండుగా ఉన్నప్పటికీ, పురుషులు, యువతలో పెరుగుతున్న వ్యతిరేకతను అధిగమించకపోతే స్టాలిన్ కూటమికి రాబోయే రోజులు సవాలుతో కూడుకున్నవేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సర్వే ఫలితాలు క్షేత్రస్థాయిలో డీఎంకే వ్యూహాలను మార్చుకోవడానికి ఒక హెచ్చరికగా నిలిచాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

5 మిత్రదేశాలకు హర్మూజ్ జలసంధి పర్మిషన్..మనకు గుడ్‌న్యూస్ యేనా!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha