Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇన్‌స్టా రీల్‌ చూసి ఇంటి బయట ఉన్న ఆకులతో కూర.. నలుగురికి అస్వస్థత

ఇన్‌స్టా రీల్‌ చూసి ఇంటి బయట ఉన్న ఆకులతో కూర.. నలుగురికి అస్వస్థత

వార్త 1 month ago

Kakinada news: కాకినాడ జిల్లాలో ఒక కుటుంబం ఇన్‌స్టాగ్రామ్ వీడియో చూసి చేసిన పొరపాటు వల్ల తీవ్ర అనారోగ్యానికి గురైంది. గండేపల్లి మండలం యర్రంపాలెంకు చెందిన వీరలక్ష్మి అనే మహిళ సోషల్ మీడియాలో వచ్చిన ఒక వంట వీడియోను గుడ్డిగా నమ్మింది.

ఆ వీడియోలో చెప్పినట్లుగా ఇంటి బయట పెరిగే ఉమ్మెత్త ఆకులతో పప్పు కూర వండింది. ఈ కూరను ఇంట్లోని నలుగురు సభ్యులు భోజనంలో తిన్నారు. తిన్న కొద్దిసేపటికే వారంతా స్పృహ కోల్పోయి మత్తులోకి జారుకోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.

Read also: Amilineni Surendra Babu: కళ్యాణదుర్గంలో పదో తరగతి టాపర్లకు ఘన సన్మానం!

 Poisonous Ummetta leaves curry health risk

Kakinada news: తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిక

కూర తిన్న వెంటనే అస్వస్థతకు గురైన వీరబ్బు, వీరలక్ష్మి, గంగాభవాని, జయలక్ష్మిలను వెంటనే పెద్దాపురం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యులు వారిని కాకినాడ జీజీహెచ్‌కి తీసుకెళ్లాలని సూచించారు. ప్రస్తుతం వీరంతా కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మెల్లగా కోలుకుంటున్నారు. అదృష్టవశాత్తూ ఆ ఇంట్లోని చిన్నపిల్లలు ఆ కూర తినకపోవడంతో వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. కేవలం ఒక రీల్ చూసి ప్రాణాల మీదకు తెచ్చుకోవడంతో స్థానికులు షాక్ అవుతున్నారు.

ఉమ్మెత్త ఆకులు ఎందుకు ప్రమాదకరం

మొక్కల్లో కొన్ని రకాలు మన ఆరోగ్యానికి ఎంతో ముప్పు కలిగిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉమ్మెత్త మొక్కలోని ఆకులు, పువ్వులు, గింజలు చాలా విషపూరితమైనవి. వీటిని తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతిని మతిమరుపు, చూపు మందగించడం వంటి సమస్యలు వస్తాయి. ఒక్కోసారి శ్వాస తీసుకోవడం కష్టమై మరణం కూడా సంభవించవచ్చు. అందుకే ఇంటర్నెట్‌లో కనిపించే ప్రతి విషయాన్ని నమ్మి ప్రయోగాలు చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. తెలియని మొక్కల జోలికి వెళ్లడం అసలు మంచిది కాదు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

మున్సిపాలిటీలో భారీ ఆర్థిక అక్రమాల ఆరోపణలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha