Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిర్మాత కేదార్, రోహిత్ మధ్య డ్రగ్స్ సంబంధాలు!

నిర్మాత కేదార్, రోహిత్ మధ్య డ్రగ్స్ సంబంధాలు!

వార్త 2 months ago

మొయినాబాద్ ఫాం హౌస్ కేసులో సంచలన విషయాలు

Moinabad Farmhouse Drugs Case: నగర శివార్లలోని మొయినాబాద్ లో గల మాజీ ఎంఎల్ఎ పైలట్ రోహిత్ రెడ్డి ఫాం హౌస్లో వెలుగు చూసిన డ్రగ్స్ పార్టీలో పోలీసులు సంచలన విషయాలు కోర్టుకు వెల్లడించారు.

2025 ఫిబ్రవరి 25వ తేదీన దుబాయిలో ఓ అపార్ట్మెంట్లో అనుమానాస్ప దస్థితిలో మరణించిన టాలీవుడ్ నిర్మాత, రియల్టర్ కేదార్ సెలగంశెట్టితో రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డిలకు డ్రగ్స్ కు సంబంధించి సం బంధాలున్నా యని పోలీసులు కోర్టుకు సమర్పించిన కస్టడీ పిటిషన్లో తెలిపారు.

Read Also: Telangana: ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు స్పెషల్ క్లాసులు.. మధ్యాహ్న భోజనం కూడా!

 Sensational details in the Moinabad farmhouse case

Moinabad Farmhouse Drugs Case: నగదు బదిలీ, పోలీసుల విచారణ

డ్రగ్స్ సరఫరా కోసం రోహిత్ రెడ్డి ఆయన సోదరుడు రితేష్ రెడ్డి లు కేదార్ సెలగంశెట్టికి 25 లక్షల రూపాయలు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ డబ్బులు రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి బ్యాంకు ఖాతాల నుంచి కే దర్ సెలగంశెట్టి ఖాతాకు వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మొయినాబాద్ ఫాం హౌస్ డ్రగ్స్ పార్టీలో అరెస్టయి చంచల్గూడ జైల్లో వున్న రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, పోలీసులపై కాల్పులు జరిపిన ఢిల్లీ రియల్టర్ నమిత్ శర్మలను మరోసారి కస్టడీకి విచారణ నిమిత్తం ఇవ్వాలని పో లీసులు రాజేంద్రనగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కేసు నేపథ్యం, అరెస్టుల వివరాలు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మొయినాబాద్లోని రోహిత్ రెడ్డి ఫాం హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం మరో మలుపు తిరిగింది. గత నెల 14 వ తేదీన డ్రగ్స్ పార్టీ రట్టవడం తెలిసిందే. ఈ పార్టీలో 11 మంది పాల్గొనగా రోహిత్ రెడ్డి సోదరులతో పాటు ఏలూరు ఎంపి పుట్టా మహేష్ యా దవ్ సహా ఆరుగురు డ్రగ్స్ సేవించినట్లు తేలడం విదితమే. అయితే పుట్టా మహేష్ యాదవ్ సహా డ్రగ్స్ సేవించిన ముగ్గురికి స్టేషన్ బెయిల్ ఇవ్వ గా పోలీసులపై కాల్పులు జరిపినందుకు, ఫాం హౌస్లో అసాంఘీక కార్యకలాపాలకు వాడినందుకు, లైసెన్స్ రివాల్వర్ను దుర్వినియోగం చేసినందుకు రోహిత్ రెడ్డి సోదరులతో పాటు నమిత్ శర్మలను అరెస్టు చేశారు. వీరు నెల రోజులకు పైగా చంచల్గూడ జైల్లో రిమాండులో వున్నారు. డ్రగ్స్ సరఫరాదారుడు రోహిత్ రెడ్డి పిఎ శరత్ కుమార్ గుర్తించారు. ఇతనితో పాటు అభిషేక్ సింగ్ అనే మరో వ్యక్తి కూడా ఇందులో వున్నట్లు తేలింది. ఈ కేసుపై విచారణ సాగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై సమీక్ష

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha