Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇంటర్నెట్ లేకుండానే UPI చెల్లింపులు.. NPCI క్రేజీ ఫీచర్!

ఇంటర్నెట్ లేకుండానే UPI చెల్లింపులు.. NPCI క్రేజీ ఫీచర్!

వార్త 2 weeks ago

UPI Payments: డిజిటల్ చెల్లింపులు చేసే వారికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఒక అత్యంత తీపి కబురు అందించింది. నెట్‌వర్క్ సమస్యలు ఉన్న ప్రదేశాల్లో కూడా ఎలాంటి ఆటంకం లేకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పూర్తి చేసేందుకు గాను నూతన సాంకేతికతను అందుబాటులోకి తీసుకురాబోతోంది.

ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా సులభంగా లావాదేవీలు నిర్వహించేలా 'ట్యాప్ అండ్ పే' (Tap and Pay) ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది.

చాలాసార్లు ఇంటర్నెట్ సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడం వల్ల లేదా సర్వర్ సమస్యల కారణంగా యూపీఐ పేమెంట్స్ ఫెయిల్ అవుతుంటాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ఎన్‌పీసీఐ ఈ కొత్త ఫీచర్‌ను డిజైన్ చేసింది. ఇంటర్నెట్ రాని లేదా సిగ్నల్స్ లభించని ప్రదేశాల్లో కూడా వినియోగదారులు నేరుగా రూ.2,000 వరకు ఎలాంటి ఆటంకం లేకుండా యూపీఐ పేమెంట్స్ చేసుకునే వెసులుబాటు ఇందులో కలగనుంది.

Read Also : LPG Gas : ఎల్పీజీకి బదులుగా ఇథనాల్.. కేంద్ర ప్రభుత్వం సిద్ధం !

 UPI payments without the internet… NPCI’s amazing feature!

UPI Payments: UPI లైట్ వ్యాలెట్ ద్వారా ప్రాసెస్

ఈ ‘ట్యాప్ అండ్ పే’ ఫీచర్ ద్వారా ఆఫ్‌లైన్ చెల్లింపులు జరపాలంటే యూజర్లు ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది. వినియోగదారులు ముందుగానే తమ యూపీఐ లైట్ (UPI Lite) వ్యాలెట్‌లో కావాల్సినంత డబ్బును జమ చేసి ఉంచుకోవాలి. వ్యాలెట్‌లో డబ్బులు ఉన్నట్లయితే, ఆఫ్‌లైన్ మోడ్‌లో కూడా సెకన్లలో లావాదేవీ పూర్తి అవుతుందని NPCI స్పష్టం చేసింది. ఈ నూతన సదుపాయం అందుబాటులోకి వస్తే చిన్న తరహా వ్యాపారులకు మరియు రోజువారీ డిజిటల్ చెల్లింపులు చేసే సాధారణ ప్రజలకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది.

యాపిల్ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ అప్‌డేట్..కొత్త రంగుల్లో రానున్న యాపిల్ ఫోన్లు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha