Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లూనాను ఢీకొన్న వాహనం.. వృద్ధుడు మృతి

లూనాను ఢీకొన్న వాహనం.. వృద్ధుడు మృతి

వార్త 3 weeks ago

Sangareddy road accident:సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని 161వ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు.

జోగిపేట నుంచి సంగారెడ్డి వైపు లూనాపై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఘటన స్థలంలోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

మృతుడు కొండాపూర్ గ్రామానికి చెందిన నరసింహ గౌడ్గా గుర్తించారు. ఆయన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారిక కారు డ్రైవర్ అశోక్ గౌడ్ తండ్రి అని సమాచారం.సమాచారం అందుకున్న పుల్కల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు.

Read also: TG New Jobs Notifications: త్వరలోనే తెలంగాణలో 50 వేల కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లు.. మంత్రి సీతక్క

Sangareddy road accident:హైవే పెట్రోలింగ్ సిబ్బంది ప్రశంసనీయమైన నిజాయితీ

అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన గుర్తు తెలియని వాహనం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా, మృతుడి వద్ద ఉన్న రూ.12.270లక్షల నగదును హైవే పట్రోలింగ్ సిబ్బంది మనోజ్, శ్రావణ్, బాలరాజు, సాయి, బాలమణి నిజాయితీగా గుర్తించి పోలీసులకు అప్పగించారు. వారి నిజాయితీని స్థానికులు, పోలీసులు అభినందించారు.

Epaper: epaper.vaartha.com

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి: కోణం విఠల్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha