Kanpur Crime : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో దారుణమైన హత్యోదంతం చోటుచేసుకుంది. ఇంట్లో నిరంతరం సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా పెడుతున్నాడనే కోపంతో ఓ కోడలు, మాజీ పనిమనిషితో కలసి తన మామను దారుణంగా హత్య చేయించింది.
కాన్పూర్‌కు చెందిన వినీత్ మనోచా (60) ప్రముఖ నిత్యావసర ఉత్పత్తులు, ఔషధాల వ్యాపారి. ఆయన తన కుటుంబ సభ్యుల కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు ఇంట్లో పలు చోట్ల సీసీటీవీ కెమెరాలను అమర్చారు.ఇంట్లో సీసీటీవీ కెమెరాలు అమర్చి ప్రతి చిన్న విషయాన్ని పర్యవేక్షించడం, స్వేచ్ఛ లేకుండా చేయడంపై కోడలు శాలు తీవ్ర అసంతృప్తికి లోనైంది. మామను వదిలించుకోవాలని నిర్ణయించుకుంది.తమ ఇంట్లో గతంలో పనిమనిషిగా పనిచేసిన గౌతమ్‌ను సంప్రదించి మామ హత్యకు ఒప్పించింది.
Read Also: AE Nookaraju Case: ఏఈ నూకరాజు కేసు.. సర్పవరం పోలీసుల కస్టడీలోకి సాదిక్ ఖాన్
Kanpur Crime
Kanpur Crime : పథకం ప్రకారం దాడి
ఈ నెల 5వ తేదీన శాలు తన భర్త, బిడ్డతో కలిసి ఒక పార్టీ పేరుతో కావాలనే ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది.ఆ సమయంలో గౌతమ్ తన స్నేహితుడు కిషోర్‌తో కలిసి వినీత్ మనోచా ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న వినీత్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్, శాలు మొబైల్ ఫోన్ కాల్ డేటా మరియు ఆడియో రికార్డింగ్‌లను విశ్లేషించిన పోలీసులు ఈ దారుణ వెనుక ఉన్న అసలు నిజాన్ని బయటపెట్టారు.హత్యకు కుట్ర పన్నిన కోడలు శాలుతో పాటు, దారుణానికి పాల్పడిన మాజీ పనిమనిషి గౌతమ్, అతని స్నేహితుడు కిషోర్‌లను పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

