Butter chicken recipe:వరల్డ్ ఫేమస్ అల్టిమేట్ బటర్ చికెన్ వంటకం ఎప్పుడు చేసినా 100% పక్కా రుచితో రావాలంటే ఇగో ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి. తందూర్ లేకున్నా సరే అచ్చం రెస్టారెంట్ రుచి ఇంట్లోనే పక్కాగా వస్తది.
Read also: Remove fish smell: చేపల నీచు వాసన పోవాలా? అయితే ఈ చిన్న చిట్కాలు పాటించండి!
Butter Chicken | Chicken Makhani
చికెన్ నానబెట్టే తీరు (మారినేషన్)
- 350 gms బోన్లెస్ చికెన్
- 1 tbsp అల్లం వెల్లులి పేస్ట్
- 1/2 చెక్క నిమ్మరసం
- ఉప్పు - కొద్దిగా
- 2 tbsp ఆవ నూనె
- 1/4 tsp నల్ల ఉప్పు
- 1/2 tsp వేయించిన జీలకర్ర పొడి
- 1/2 tsp కారం
- 1 tsp కాశ్మీరీ కారం
- 1/2 tsp ధనియాల పొడి
- 1/2 tsp కసూరి మేథి
- 4 tbsp గడ్డ పెరుగు
- 1/2 tsp యాలకల పొడి
- 1/2 tsp ఆంచూర్ పొడి
Butter chicken recipe: గ్రేవీకి కావాల్సిన సామాన్లు
- 4 టొమాటో (250 gms)
- 1 ఇంచ్ దాల్చిన చెక్క
- 2 యాలకలు
- 2 లవంగాలు
- బిర్యానీ ఆకు - సగం
- 1/2 ఇంచు అల్లం
- 5 వెల్లులి
- ఉప్పు
- 1/4 tsp పంచదార
- 15 జీడిపప్పు
- 1/2 cup ఉల్లిపాయ చీలికలు
- 3 tbsp హెరిటేజ్ బటర్
- 4 కాశ్మీరీ మిరపకాయలు
- 1/2 tsp మిరియాలు
- 250 ml నీళ్ళు
గ్రిల్ చేయడానికి అండ్ కర్రీకి
- గ్రిల్ కోసం: 1 tbsp నూనె, 1 tsp బటర్
- కర్రీ కోసం: 2 tbsp నూనె, 3 tsp బటర్, 1 tsp కాశ్మీరీ కారం, 1 tsp కారం, 1/2 tsp వేయించిన జీలకర్ర పొడి, 400 ml నీళ్ళు, సాల్ట్, 1 tsp కసూరి మేథి, 2 tsp బటర్, 3 tbsp ఫ్రెష్ క్రీమ్, 1 tbsp తేనె, కాల్చిన కొబ్బరి పెంకులు లేదా బొగ్గు ముక్కలు, 2 చిటికెళ్లు గరం మసాలా, 3 బొట్లు నెయ్యి
బటర్ చికెన్ వండే పద్ధతి
- ముందుగా చికెన్ బ్రెస్ట్ కి గాట్లు పెట్టుకుని అల్లం వెల్లులి పేస్ట్, నిమ్మరసం, ఉప్పు పట్టించి పక్కన పెట్టుకోవాలి.
- మరో గిన్నెలో ఆవ నూనెలో కాశ్మీరీ కారం కలిపి, గడ్డ పెరుగుతో పాటు మిగిలిన మారినేషన్ పదార్థాలన్నీ వేసి కలుపుకోవాలి.
- ఈ మసాలాను చికెన్ కి బాగా పట్టించి రాత్రంతా లేదా కనీసం నాలుగు గంటలు ఫ్రిజ్ లో ఉంచాలి.
- పాన్ లో గ్రేవీ సామాన్లన్నీ వేసి కరిగిన బటర్ లో 3 నిమిషాలు వేపుకోవాలి.
- ఇందులో నీళ్ళు పోసి జీడిపప్పు మెత్తబడేదాకా ఉడికించి వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి.
- గ్రిల్ పాన్ మీద నూనె, బటర్ వేసి నానిన చికెన్ ముక్కలను హై ఫ్లేమ్ మీద 5 నిమిషాలు ఉంచి, ఆ తర్వాత మంట తగ్గించి 80% గ్రిల్ చేసుకోవాలి.
- కర్రీ పాన్ లో నూనె, బటర్ వేసి కాశ్మీరీ కారం, జీలకర్ర పొడి వేసి వేపుకోవాలి.
- జల్లెడలో టొమాటో గుజ్జు వడకట్టి నీళ్ళు పోసి హై ఫ్లేమ్ మీద ఉడికించి చిక్కబడనివ్వాలి.
- చిక్కబడిన గ్రేవీలో గ్రిల్ చేసుకున్న చికెన్ ముక్కలు, సాల్ట్ వేసి బటర్ పైకి తేలేదాకా సన్నని సెగ మీద ఉడికించాలి.
- కసూరి మేథి, బటర్, ఫ్రెష్ క్రీమ్, తేనె వేసి కలిపి, కూర మధ్యలో గిన్నె పెట్టి బొగ్గు ముక్కపై గరం మసాలా, నెయ్యి వేసి 3 నిమిషాలు మూతపెట్టి దించాలి.
- వేడి వేడి బటర్ చికెన్ రెడీ, పైన క్రీమ్ తో రోటీ లేదా నాన్ లోకి అద్ది తింటే అద్భుతంగా ఉంటది.
గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన టిప్స్
- చికెన్ కి మసాలాలు పట్టిచ్చి రాత్రంతా ఫ్రిజ్ లో పెడితేనే కూరల రుచి అద్దిరిపోతది.
- గ్రిల్ చేసేటప్పుడు చికెన్ లోని నీరు మొత్తం ఇగిరిపోకుండా చూసుకోవాలి, లేదంటే ముక్కలు గట్టిగ అయితాయ్.
- అచ్చం రెస్టారెంట్ లాంటి స్మోకీ ఫ్లేవర్ కోసం బొగ్గు ముక్క లేదా కాల్చిన కొబ్బరి పెంకును తప్పకుండా వాడాలి.
Epaper: epaper.vaartha.com

