Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేటి నుంచి ప్లేఆఫ్స్ సమరం.. మోస్ట్ సక్సెస్ టీమ్స్ ఇవే !!

నేటి నుంచి ప్లేఆఫ్స్ సమరం.. మోస్ట్ సక్సెస్ టీమ్స్ ఇవే !!

వార్త 3 months ago

IPL 2026 Playoff Teams : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) పండుగ ముగింపు దశకు చేరుకుంది. లీగ్ స్టేజ్ మ్యాచ్‌లు విజయవంతంగా పూర్తి కావడంతో నేటి నుంచి అసలైన ప్లేఆఫ్స్ సమరం ప్రారంభం కానుంది.

టాప్-4 లో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. ఐపీఎల్ సుదీర్ఘ చరిత్రను పరిశీలిస్తే, ప్లేఆఫ్స్ చేరడంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అత్యంత విజయవంతమైన జట్టుగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. టోర్నీ హిస్టరీలో రికార్డు స్థాయిలో 12 సార్లు ప్లేఆఫ్స్ క్వాలిఫై అయిన సీఎస్‌కే.. ఇప్పటివరకు ఆడిన 26 నాకౌట్ మ్యాచ్‌ల్లో 17 విజయాలతో అత్యుత్తమ రికార్డును కలిగి ఉంది. ఆ తర్వాతి స్థానంలో 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ 22 మ్యాచ్‌ల్లో 14 విజయాలతో రెండో స్థానంలో నిలిచింది. అయితే, క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే.. ఈ సీజన్‌లో ఈ ఇద్దరు దిగ్గజాలు (CSK, MI) ప్లేఆఫ్స్ రేసు నుంచి ముందే తప్పుకున్నారు.

Read Also : ట్రోలింగ్‌తో శ్రేయస్ సోదరి ఆవేదన.. "అది సరదా వీడియో మాత్రమే"

నాకౌట్ రేసులో మిగిలిన జట్లు

ఈ మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్ల తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) 10 సార్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 7 సార్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) 6 సార్లు ప్లేఆఫ్స్ చేరి తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రస్తుత 2026 సీజన్ విషయానికి వస్తే, డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో స్థానంతో క్వాలిఫై అయింది. ఈ రోజు (మే 26) ధర్మశాల వేదికగా జరగనున్న క్వాలిఫయర్-1 లో ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్ తలపడనుండగా.. రేపు (మే 27) జరగబోయే ఎలిమినేటర్ మ్యాచ్‌లో హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఢీకొనబోతున్నాయి. గత రికార్డులు ఎలా ఉన్నా, ప్రస్తుత ఫామ్ ప్రకారం ఈ నాలుగు జట్లు కూడా బలంగా ఉండటంతో ఈసారి ఐపీఎల్ ట్రోఫీని ఎవరు ముద్దాడుతారనేది అత్యంత ఆసక్తికరంగా మారింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఐపీఎల్ 2026లో భారీ ధర పలికి నిరాశపరిచిన స్టార్ బ్యాటర్లు వీరే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha