Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
IPL సీజన్ ముగిసింది..ఇకనైనా ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తారో ?

IPL సీజన్ ముగిసింది..ఇకనైనా ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తారో ?

వార్త 3 weeks ago

IPL 2026 : క్రికెట్ ప్రేమికులను గత రెండు నెలలుగా ఉర్రూతలూగించిన ఐపీఎల్ 2026 (IPL 2026) ముగియడం తో , ఇప్పుడు అందరి దృష్టి టాలీవుడ్ బాక్సాఫీస్ వైపు మళ్లింది.

ఐపీఎల్ మ్యాచ్‌ల హడావుడి వల్ల గత కొన్ని వారాలుగా థియేటర్లు వెలవెలబోయాయి, పెద్ద సినిమాలేవీ విడుదల కాకపోవడంతో ట్రేడ్ వర్గాలు తీవ్ర నష్టాలను చవిచూశాయి. అయితే, ఈ క్రికెట్ సమరం ముగియడంతో జూన్ నెలలో సరికొత్త సినిమాలతో బాక్సాఫీస్ వద్ద హంగామా సృష్టించేందుకు టాలీవుడ్ సిద్ధమైంది. ఈనెల 4వ తేదీన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’తో ఈ సినీ సందడి ఘనంగా ప్రారంభం కానుంది. ఈ భారీ చిత్రంపై పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి. ఐపీఎల్ ఫీవర్ నుంచి బయటపడిన ప్రేక్షకులు థియేటర్లకు పెద్ద ఎత్తున తరలివచ్చి తెలుగు సినిమాకు పూర్వవైభవం తెస్తారని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

Read Also ; ఈ సాలా కప్ నమ్దే.. వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా ఆర్‌సీబీ

జూన్ నెలలో సినిమాల జాతర.. సరికొత్త చిత్రాలతో పాటు క్లాసిక్ రీ-రిలీజ్!

ఈ జూన్ నెల టాలీవుడ్‌లో సరికొత్త చిత్రాల జాతరను తలపిస్తోంది. రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదలైన మరుసటి రోజే అంటే జూన్ 5న ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత జూన్ 11న ‘సింగ్ గీతం’, జూన్ 19న టాలీవుడ్ క్వీన్ సమంత లీడ్ రోల్‌లో నటించిన ‘మా ఇంటి బంగారం’తో పాటు ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’, ‘కాక్‌టైల్ 2’, ‘దీవానా’ వంటి క్రేజీ చిత్రాలు ఒకేరోజు పోటీ పడనున్నాయి. ఇక నెల చివర్లో జూన్ 26న అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘లెనిన్’ సినిమా విడుదల కానుంది. వీటితో పాటు, జూన్ 10న నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీ హిట్ క్లాసిక్ చిత్రం ‘సమరసింహారెడ్డి’ భేరీ ఫ్యాన్స్‌ను అలరించడానికి సరికొత్త డిజిటల్ ప్రింట్‌తో రీ-రిలీజ్ కాబోతోంది. వరుసగా ఇన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లు లైన్ లో ఉండటంతో, రాబోయే రోజుల్లో థియేటర్ల వద్ద మళ్లీ పాత రోజులు కనిపిస్తాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఈ ఏడాది IPL ఎంతో ప్రత్యేకం ..ఎలాగో తెలుసా ?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha