RC-130 నిఘా విమానం, నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్ వివాదం
అమెరికా నిఘా వర్గాల సమాచారం ప్రకారం, ఇరాన్‌కు చెందిన అత్యంత కీలకమైన RC-130 నిఘా విమానాన్ని పాకిస్థాన్‌లోని రావల్పిండిలో ఉన్న నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్‌కు తరలించారు.
ఈ విమానం ఇరాన్ సైనిక వ్యూహాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. అమెరికా దాడులు చేస్తే ఈ అత్యాధునిక విమానం ధ్వంసమవుతుందనే భయంతో, ఇరాన్ దానిని సురక్షిత ప్రాంతమైన పాక్‌కు పంపినట్లు తెలుస్తోంది. ఒక మధ్యవర్తిగా ఉంటూనే, ఒక పక్షానికి సైనిక రక్షణ కల్పించడం అంతర్జాతీయ దౌత్య నిబంధనలకు విరుద్ధమని అమెరికా భావిస్తోంది. ఈ ఆరోపణలపై పాకిస్థాన్ రక్షణ శాఖ స్పందిస్తూ.. ఆ విమానాలు రహస్యంగా రాలేదని, కేవలం దౌత్యపరమైన చర్చల నిమిత్తం వచ్చిన ప్రతినిధి బృందానికి చెందినవని పేర్కొంది. నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్ నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉంటుందని, అక్కడ విమానాలను దాచడం సాధ్యం కాదని పాక్ బుకాయిస్తోంది. అయితే, అమెరికా మాత్రం పాక్ మాటలను నమ్మే స్థితిలో లేదు.
Read Also: TMC Latest News : టీఎంసీకి షాక్.. మాజీ మంత్రి సుజిత్ బోస్ అరెస్ట్
Iran-America War
Iran-America War: ట్రంప్ సర్కారు ఆగ్రహం – ‘నమ్మదగని దేశం’
అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరికగా మారాయి. ఒకవైపు అమెరికా నుంచి రక్షణ సాయం పొందుతూ, మరోవైపు ఇరాన్‌కు సహకరించడంపై సెనేట్ తీవ్రంగా ఉంది. “పాకిస్థాన్ డబుల్ గేమ్ ఆడుతోంది” అని అమెరికా రక్షణ నిపుణులు విమర్శిస్తున్నారు. దీనివల్ల రాబోయే రోజుల్లో పాకిస్థాన్‌కు అందే అమెరికా ఆర్థిక సాయం నిలిచిపోయే ప్రమాదం ఉంది.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా వ్యాఖ్యలు చూస్తుంటే, అమెరికా దౌత్య మార్గాల కంటే సైనిక చర్యకే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఇరాన్ పంపిన శాంతి ప్రతిపాదనలను ఆయన “చెత్త”గా కొట్టిపారేయడం, ఇరాన్ ప్రస్తుతం ‘వెంటిలేటర్’ మీద ఉందని వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. పాక్ తీరు వల్ల చర్చలు మరింత క్లిష్టంగా మారాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

