Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీఎంసీకి షాక్.. మాజీ మంత్రి సుజిత్ బోస్ అరెస్ట్

టీఎంసీకి షాక్.. మాజీ మంత్రి సుజిత్ బోస్ అరెస్ట్

వార్త 3 months ago

టీఎంసీకి గట్టి ఎదురుదెబ్బ

TMC Latest News : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి సుజిత్ బోస్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది.

పశ్చిమ బెంగాల్‌లో అధికార మార్పిడి తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సుజిత్ బోస్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పురపాలక నియామకాల కుంభకోణం కేసులో భాగంగా కోల్‌కతాలో సోమవారం రాత్రి ఆయనను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈ చర్యలు చేపట్టినట్లు ఈడీ తెలిపింది.

150 మందికి అక్రమ ఉద్యోగాల ఆరోపణలు

సౌత్ దమ్‌దమ్ మున్సిపాలిటీలో డబ్బులు తీసుకుని దాదాపు 150 మందికి అక్రమంగా ఉద్యోగాలు ఇప్పించారన్నది సుజిత్ బోస్‌పై ఉన్న ప్రధాన ఆరోపణ. ఉద్యోగాల కోసం తీసుకున్న డబ్బుకు బదులుగా ఆయన ఫ్లాట్లు, భారీ నగదు రూపంలో అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఆధారాలు లభించాయని ఈడీ అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం తన కుమారుడితో కలిసి విచారణకు హాజరైన సుజిత్ బోస్‌ను అధికారులు గంటల తరబడి ప్రశ్నించారు. విచారణకు పూర్తిగా సహకరించకపోవడం, పొంతనలేని సమాధానాలు ఇవ్వడం వల్లే అరెస్ట్ చేసినట్లు ఈడీ ప్రకటించింది.

Read Also:TamilNadu Politics: ప్రకాశ్ రాజ్ 'సెల్యూట్' ఎవరికో తెలుసా?

 TMC Latest News

రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న కేసు

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అరెస్ట్ కావడం ఇదే తొలిసారి కావడంతో ఈ వ్యవహారం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా గతేడాది అక్టోబర్‌లో కూడా సుజిత్ బోస్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం ఆయనను పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి కస్టడీ కోరనున్నట్లు సమాచారం. ఈ అరెస్ట్‌తో పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరింత వేడి పెరిగింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన: సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha