Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇషా సింగ్ కు సీఎం రేవంత్ అభినందనలు

ఇషా సింగ్ కు సీఎం రేవంత్ అభినందనలు

వార్త 2 weeks ago

WC-2026 : జర్మనీలోని మ్యూనిచ్ వేదికగా జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ (ISSF) వరల్డ్ కప్-2026 తుది పోరులో హైదరాబాద్‌కు చెందిన యువ సంచలనం, భారత షూటర్ ఇషా సింగ్ సరికొత్త ప్రపంచ రికార్డుతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్‌ విభాగంలో అద్భుతమైన గురితో దూసుకెళ్లిన ఇషా.. మొత్తం 50 పాయింట్లకు గాను ఏకంగా 43 హిట్స్‌ సాధించి సరికొత్త వరల్డ్ రికార్డును నెలకొల్పింది. ఈ అద్భుత విజయంతో ప్రపంచ వేదికపై భారతదేశ కీర్తిపతాకాన్ని ఎగురవేసిన ఇషా సింగ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఇషా తన అసాధారణ క్రమశిక్షణ, మొక్కవోని పట్టుదలతో దేశంలోని లక్షలాది మంది యువతకు ఆదర్శంగా నిలిచిందని సీఎం కొనియాడారు. భవిష్యత్తులో ఆమె మరెన్నో అంతర్జాతీయ విజయాలు సాధించి, క్రీడా రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

Read Also : వర్షం వస్తుందని తెలిసినా.. ధాన్యం సేకరణలో విఫలమైన ప్రభుత్వం

ఒలింపిక్ ఛాంపియన్లకు షాక్.. గ్లోబల్ వేదికపై హైదరాబాద్ తేజం రికార్డుల వేట!

హోరాహోరీగా సాగిన ఈ తుది పోరులో స్థానిక జర్మనీ ఫేవరెట్, మాజీ ప్రపంచ ఛాంపియన్ డోరీన్ వెన్నెకాంప్‌ను 5 హిట్స్ తేడాతో ఓడించి ఇషా బంగారు పతకాన్ని ముద్దాడింది. పోటీల ప్రారంభం నుండి ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా అత్యంత నిశ్చలంగా, ఏకాగ్రతతో ఇషా గురిపెట్టిన తీరు అంతర్జాతీయ క్రీడా వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. గచ్చిబౌలి స్టేడియంలో సాధారణ ప్రాక్టీస్‌తో ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈ హైదరాబాదీ అమ్మాయి, నేడు ప్రపంచ వేదికపై నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోవడం పట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని క్రీడాభిమానులు పండుగ చేసుకుంటున్నారు. రాబోయే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ టోర్నీల్లోనూ ఇషా సింగ్ ఇదే తరహా ప్రదర్శనతో దేశానికి మరిన్ని పతకాలు తీసుకువస్తుందని క్రీడా విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

వైభవ్ సూర్యవంశీ ఆర్ఆర్ జట్టులోకి ఎలా వచ్చాడంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha