Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇథనాల్ ఫ్యాక్టరీ మూసివేయాలి: అఖిలపక్ష పార్టీలు

ఇథనాల్ ఫ్యాక్టరీ మూసివేయాలి: అఖిలపక్ష పార్టీలు

వార్త 1 week ago

Bejjanki Ethanol Factory: "రైతు యుద్ధం - ప్రజా ఆరోగ్యం" కార్యక్రమం విజయవంతం..బెజ్జంకి మండల కేంద్రంలో ఇథనాల్ ఫ్యాక్టరీల వల్ల ఏర్పడుతున్న కాలుష్య సమస్యలపై "రైతు యుద్ధం - ప్రజా ఆరోగ్యం" పేరుతోప్రజా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

Read Also:Gachibowli Lift Accident: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి ఐదేళ్ల బాలిక మృతి

ఈ కార్యక్రమంలో BRS , CPM, CPI, DSP రాజకీయ పార్టీలు,Mrps ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ,
ఇథనాల్ ఫ్యాక్టరీల నుండి వెలువడుతున్న విషవాయువులు ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారాయని, భూమి మరియు పర్యావరణ కాలుష్యం పెరుగుతోందని, రైతుల వ్యవసాయ భూములు నష్టపోతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. అదనంగా తీవ్ర శబ్ద కాలుష్యం కారణంగా గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

Bejjanki Ethanol Factory: ఈ సందర్భంగా ప్రజలు ఐక్యంగా నిరసన తెలుపుతూ MRO

అధికారులకు ప్రజా వినతి పత్రం సమర్పించడం జరిగింది. కాలుష్య నియంత్రణ చర్యలు వెంటనే చేపట్టాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని, రైతుల భూములకు రక్షణ కల్పించాలని ఫ్యాక్టరీ ముసివేయాలి అని డిమాండ్ చేశారు.గ్రామాల భవిష్యత్తు మరియు ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఈ పోరాటం కొనసాగుతుందని తెలిపారు,ఈ కార్యక్రమం నిర్వాహకులు లింగాల సురేష్ న్యాయవాది DSP మానకొండూర్ నియోజకవర్గ ఇన్చార్జి, BRS పార్టీ వంగల నరేష్ ,

సీపీఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్, CPI సహయ కార్యదర్శి సంగెం మదు,బిఆర్ ఎస్ నాయకులు తిప్పారపు మహేష్, బోనగిరి శివ, దొంతరవెని శ్రీనివాస్,BJP నర్సింగ్, BSP మాంకాళి సురేష్, CPM నాయకులు సంఘ ఎల్లయ్య, బొమ్మిడి సాయికృష్ణ,బోనగిరి లింగం, పర్షరాములు AIYF మధు,శ్రీనివాస్, లింగయ్య, DSP విజయ్ ,DSU శంకర్, MRPS చంద్రం, మాల మహానాడు, SWERO సంస్థల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

కొమురవెల్లి మల్లన్న సేవలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha