Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొమురవెల్లి మల్లన్న సేవలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్

కొమురవెల్లి మల్లన్న సేవలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్

వార్త 1 week ago

MLA Naveen Yadav: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ బుధవారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలు అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు.

Read Also:Bandi Bhagirath: బండి భగీరథ్ పరారీ: హైదరాబాద్‌లో వెలసిన పోస్టర్లు, విచారణకు గైర్హాజరు

రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థన

దర్శనం అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. మల్లన్న దేవుడు తమ ఇంటి దైవం మరియు కుల దైవం అని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

MLA Naveen Yadav: మాస్టర్ ప్లాన్ జాబితాలో కొమురవెల్లి: సీఎంకు విజ్ఞప్తి

ఆలయ అభివృద్ధిపై ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.గతంలో రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ద్వారా అభివృద్ధి చేయడానికి నిర్ణయించిన 9 ప్రధాన దేవాలయాల జాబితాలో కొమురవెల్లి ఆలయాన్ని కూడా చేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరతానని చెప్పారు.భక్తుల సౌకర్యార్థం దేవాలయం సమీపంలో ప్రభుత్వం తరఫున ఒక అత్యాధునిక అతిథి గృహాన్ని నిర్మించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మాధవి మల్లికార్జున్, ఏఈఓ బుద్ధి శ్రీనివాస్ మరియు ఇతర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి ఐదేళ్ల బాలిక మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha