KA Paul: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఇటీవల తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
“పవన్ కల్యాణ్ ఇలా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం న్యాయమేనా?” అని పాల్ నిలదీశారు.
PawanKalyanVsKAPaul
Read also: Chittoor District: వనదుర్గపురంలో పర్యావరణ దినోత్సవ ర్యాలీ, సమావేశము
ప్రజల సమస్యలు వదిలేసి.. ఈ గొడవలేంటి?
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రజలు ప్రశ్నిస్తుంటే, ఆ ప్రధానాంశాలను పక్కదారి పట్టించేందుకే ఈ తరహా వివాదాలు సృష్టిస్తున్నారని కేఏ పాల్ మండిపడ్డారు. ఇదే సమయంలో ఆయన పవన్ కల్యాణ్‌కు ఒక ఆసక్తికర ఆహ్వానం పలికారు. జూన్ 14వ తేదీన అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో తాను ఒక భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నానని, ఆ సభకు పవన్ కల్యాణ్ కూడా హాజరుకావాలని పాల్ పిలుపునిచ్చారు.
KA Paul: వివాదానికి కారణమైన పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు
ఇంతకీ ఈ వివాదానికి అసలు కారణం.. ఇటీవల పవన్ కల్యాణ్ నిర్వహించిన ప్రెస్ మీట్. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తెలంగాణలోనూ బరిలోకి దిగుతుందని, త్వరలోనే తాను ఇక్కడ విస్తృతంగా పర్యటిస్తానని పవన్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ… “నన్ను తెలంగాణలో అడుగుపెట్టనివ్వం అనడానికి తెలంగాణ ఏమైనా మీ జాగీరా?” అంటూ కొందరు నేతలను ఉద్దేశించి ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:
గండిపేట ప్రభుత్వ భూముల కబ్జా కేసు: వైకాపా మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

