Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జామకాయ కోసిందని 4 ఏళ్ల చిన్నారిని బంధించిన మాజీ ఆర్మీ అధికారి!

జామకాయ కోసిందని 4 ఏళ్ల చిన్నారిని బంధించిన మాజీ ఆర్మీ అధికారి!

వార్త 2 months ago

Himachal Pradesh Crime: హిమాచల్ ప్రదేశ్‌లోని ఊనా జిల్లాలో మానవత్వం సిగ్గుపడేలా ఒక దారుణ ఘటన వెలుగుచూసింది. కేవలం తన ఇంటి ప్రాంగణంలోని చెట్టు నుంచి జామకాయలు కోసిందన్న చిన్న కారణంతో, ఒక మాజీ ఆర్మీ అధికారి నాలుగేళ్ల పసిపాపపై కనికరం లేకుండా ప్రవర్తించాడు.

చిన్నారి అని కూడా చూడకుండా రాక్షసంగా హింసించిన తీరు స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

Read Also:Zahirabad Kavitha Murder Case: ప్రియుడితో వెళ్లిన భార్యను గొంతు కోసి చంపిన భర్త

 Himachal Pradesh Child Torture Case

కాళ్లు, చేతులు కట్టేసి దారుణ హింస

మెట్ల రైలింగ్‌కు చిన్నారి కాళ్లు, చేతులు కట్టి కొడుతూ వేధించాడు. "నన్ను కాపాడండి" అంటూ చిన్నారి వేడుకున్నా కనికరం చూపలేదు. ఈ ఘటనను గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, వారు బాలికను రక్షించారు. చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడు మాజీ ఆర్మీ అధికారి అని సమాచారం.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఢిల్లీ అసెంబ్లీ వద్ద హైడ్రామా: గేటును ఢీకొట్టి లోపలికి దూసుకెళ్లిన కారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha