Dailyhunt
ప్రియుడితో వెళ్లిన భార్యను గొంతు కోసి చంపిన భర్త

ప్రియుడితో వెళ్లిన భార్యను గొంతు కోసి చంపిన భర్త

వార్త 1 week ago

Zahirabad Kavitha Murder Case: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో సంఘటన. వివాహేతర సంబంధంతో ప్రియుడితో కలిసి అదృశ్యమైన భార్య ను తిరిగి తీసుకువస్తుండగా అవమానంతో భార్యను భర్త కత్తితో పొడిచిచంపిన సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో సోమవారం జరిగింది.

ఇందుకు సంబంధించిన జహీరాబాద్ పోలీసుల వివరాల ప్రకారం పట్టణంలోని వెంకటరమణ కాలనీకి చెందిన పటేల్ సిద్ధారెడ్డి భార్య కవిత 29 మార్చి 27వ తేదీన ఇంటి నుండి ప్రియుడితో పారిపోగా, భర్త సిద్ధారెడ్డి ఈమెరకు మార్చి 30 తేదీన పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అదృశ్యం కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించగా కవిత తన ప్రియుడు పవన్ రెడ్డితో జడ్చర్ల లో కలిసి ఉన్నట్లు సమాచారం.

Read Also:Sangareddy: రోడ్డు ప్రమాదంలో జింక మృతి

Zahirabad Kavitha Murder Case: పోలీసులు, భర్త సిద్ధారెడ్డితో కలిసి కవితను తీసుకువచ్చేందుకు జడ్చర్లకు వెళ్లి ప్రియుడు పవర్ రెడ్డి దగ్గర ఉన్న కవితను తీసుకొని కారులో జహీరాబాద్ కు తిరుగు ప్రయాణం కాగా సదాశివపేట మండలం నంది కంది వద్దకు రాగానే భర్త సిద్ధారెడ్డి అప్పటికే అవమానంతో రగిలిపోయి తన వద్ద తెచ్చుకున్న కత్తితో కవిత గొంతుపై బలంగా పొడవడంతో కవిత తీవ్ర గాయాలై ఆసుపత్రికి తరలించగానే కవిత చనిపోయింది. శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.కవిత ను హత్య చేసిన భర్త సిద్ధారెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

బ్రిడ్జిపై అగ్ని ప్రమాదం.. లారీలో చెలరేగిన మంటలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha