Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సిద్ధరామయ్య రాజీనామా.. కన్నీరు పెట్టుకున్నమంత్రి సంతోష్ లాడ్!

సిద్ధరామయ్య రాజీనామా.. కన్నీరు పెట్టుకున్నమంత్రి సంతోష్ లాడ్!

వార్త 2 weeks ago

Karnataka politics: కర్ణాటక రాజకీయాల్లో గురువారం నాడు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయాలనే తుది నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించడంతో కాంగ్రెస్ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాయి.

తన అధికారిక నివాసం ‘కావేరి’లో ఏర్పాటు చేసిన ప్రత్యేక అల్పాహార విందు వేదికగా ఆయన ఈ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రివర్గ సహచరులు తీవ్ర భావోద్వేగానికి గురవగా.. సిద్ధరామయ్యకు అత్యంత నమ్మకస్తుడైన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ మీడియా ముందే వెక్కివెక్కి ఏడుస్తూ కన్నీటిపర్యంతమయ్యారు.

Read Also : Karnataka Politics: కర్ణాటక రాజకీయాల్లో పెను సంచలనం.. కొత్త సీఎం పై ఉత్కంఠ

 Siddaramaiah resigns.. Minister Santosh Lad breaks down in tears!

ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ అంతర్గత పరిణామాలను చట్టం, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్.కె. పాటిల్ మీడియాతో పంచుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలతో సిద్ధరామయ్య జరిపిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం వెలువడిందని ఆయన తెలిపారు. పార్టీ అగ్రనాయకత్వం ఇచ్చిన సలహాను, ఆదేశాలను గౌరవిస్తూ సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయడానికి అంగీకరించారని, గురువారం మధ్యాహ్నమే ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్ కార్యాలయానికి సమర్పించనున్నారని హెచ్.కె. పాటిల్ స్పష్టం చేశారు.

karnataka politics: మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన సిద్ధరామయ్య.. సంతోష్ లాడ్ భావోద్వేగం

రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి మాట్లాడుతూ.. గడిచిన కాలంలో తనకు పూర్తి సహకారం అందించినందుకు సిద్ధరామయ్య క్యాబినెట్ సహచరులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సిద్ధరామయ్య ప్రధాన అనుచరుడైన మంత్రి సంతోష్ లాడ్ అల్పాహార విందు ముగిసిన తర్వాత బయటకు వచ్చి.. మీడియా కెమెరాల ముందే తన భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. సిద్ధరామయ్య లాంటి గొప్ప నాయకుడు పదవి నుంచి తప్పుకోవడాన్ని జీర్ణించుకోలేక ఆయన కన్నీరు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha