Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జబర్దస్త్ నటుడిపై అటాక్.. అసలు నిజం ఇదే!

జబర్దస్త్ నటుడిపై అటాక్.. అసలు నిజం ఇదే!

వార్త 2 months ago

Jabardasth fame Komurakka: ప్రముఖ కామెడీ షో 'జబర్దస్త్' ద్వారా 'కొమురక్క'గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు కుమార్ పై సొంత అసిస్టెంట్ పాత కక్షలతో దాడికి పాల్పడటం సంచలనం సృష్టించింది.

మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో కుమార్ సోదరుడు, స్థానికులు కూడా గాయపడ్డారు.

Read Also:Bhanuka Rajapaksa vs Harshi Rasanga: శ్రీలంక క్రికెట్‌లో గోల్డ్ చైన్ గొడవ

దాడికి దారితీసిన నేపథ్యం

ఈ వివాదం వెనుక ఒక పాత దొంగతనం ఉందనే విషయం విచారణలో తేలింది.గతంలో కొమురక్క ఇంట్లో జరిగిన బంగారం దొంగతనం విషయంలో తన అసిస్టెంట్ శ్రీనాథ్‌ను కుమార్ నిలదీశారు. తాను బంగారం తిరిగి ఇస్తానని ఒప్పుకున్న శ్రీనాథ్, ఆ మాట నిలబెట్టుకోలేదు.రెండు రోజుల క్రితం కుమార్ అతడిని గట్టిగా మందలించడంతో, కక్ష పెంచుకున్న శ్రీనాథ్ తన స్నేహితులతో కలిసి దాడికి పథకం వేశాడు.మొత్తం 8 మంది కలిసి కొమురక్కను కలిసేందుకు వచ్చి గొడవ పెట్టుకున్నారు. ఈ ఘర్షణలోనే ఆ యువకులు కొమురక్కపై దాడి చేయడంతో.. గాయాలు అయ్యాయి. కొమురక్క ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు.

 Attack on Jabardasth Komurakka

Jabardasth fame Komurakka: అర్ధరాత్రి హైడ్రామా – దాడి జరిగిన తీరు

తాము కొమురక్క ఫ్యాన్స్ అని.. ఫోటో దిగేందుకు వచ్చామని చెప్పి నమ్మించారు. ఈ క్రమంలోనే అందులో ఒక వ్యక్తి.. కొమురక్క దగ్గరికి వెళ్లి.. శ్రీనాథ్‌ను ఎందుకు తిట్టావని గొడవకు దిగాడు.ఈ గొడవ జరుగుతుండగానే.. మరో వ్యక్తి రాయితో కొమురక్కపై దాడి చేశాడు. అది గమనించి కొమురక్క సోదరుడు యాదయ్య అడ్డుకున్నాడు. దీంతో యాదయ్యపైనా మరో వ్యక్తి రాయితో దాడి చేశాడు. ఇంకో వ్యక్తి.. కర్రతో కొమురక్కను కొట్టడంతో.. కుడి చేతికి గాయం అయింది.

ఈ గొడవను ఆపేందుకు వెళ్లిన మరో వ్యక్తిని నిందితులు రాళ్లతో కొట్టారు. ఈ క్రమంలోనే వారిపై బెదిరింపులకు దిగారు. ఎప్పటికైనా కొమురక్కను చంపేస్తామని హెచ్చరించారు. గ్రామస్తులు కలసి అడ్డుకున్నప్పటికీ, నిందితులు తమ బైక్‌లను వదిలి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి, ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ప్రజలకు హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha