ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేసిన మంత్రి నారాయణ
Nellore Pensions: ఆర్ధిక ఇబ్బందుల్లో సైతం అవ్వా, తాతలకు ఇచ్చిన మాట తప్పని ప్రభుత్వం తమదని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు.
క్రమం తప్పకుండా ఇంటి ముంగిటికే పెన్షన్ డబ్బులు చేరుతుండడంతో లబ్దిదారుల ఆనందానికి అవధులు లేవన్నారు. వారి ఆశీస్సులే తమ ప్రభుత్వానికి శ్రీరామ రక్ష అని తెలిపారు. నెల్లూరు సిటీలోని 5వ డివిజన్ అహ్మద్ నగర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జన జాతరను తలపించింది.
Read also: Hanuman Jayanti 2026: ప్రజలకు హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

A Festival of Pensions in Nellore City
Nellore Pensions: అహ్మద్ నగర్‌లో పండుగ వాతావరణం
రాష్ట్ర మంత్రి నారాయణ స్వయంగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి, అవ్వాతాతలు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు పెన్షన్ నగదును అందజేయడంతో అహ్మద్ నగర్ వీధులన్నీ పండుగ వాతావరణంతో నిండిపోయాయి. మంత్రికి స్థానిక వమిళలు మంగళహారతులతో నీరాజనాలు పట్టి ఆత్మీయ స్వాగతం పలికారు. పూరిగుడిసెల్లో నివసించే నిరుపేదల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఆర్థిక ఇబ్బందుల్లోనూ మాట తప్పని ప్రభుత్వం
గత ప్రభుత్వం వేల కోట్ల అప్పులు పెట్టి వెళ్లినా, ఆర్ధిక ఇబ్బందులను అధిగమించి ఇచ్చిన మాట ప్రకారం రూ.4వేలు పెన్షన్ అందిస్తున్న ధీశాలి చంద్రబాబునాయుడు అని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే రోజు 99 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేసి ఏపీ రికార్డు సృష్టించిం దన్నారు. అభివృద్ధి, సంక్షేమమే రెండు కళ్లుగా ముందుకు సాగుతామన్నారు.
నెల్లూరు అభివృద్ధిపై మంత్రి విజన్
కోట్లతో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం, 50 వేల మొక్క లతో నెల్లూరును గ్రీన్ సిటీగా మార్చడమే తన లక్ష్యమని చెప్పారు. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ మంత్రి నారాయణ దాతృత్వం, క్రమశిక్షణ నెల్లూరు అభివృద్ధికి వెన్నముకని ప్రశంసించారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో కమీషనర్ నందన్, మేయర్ సుజాతా అశోక్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్ళపాక అనురాధ, డివిజన్ క్లస్టర్ శశికుమార్, ప్రెసిడెంట్ గంగాధర్, యూనిట్ ఇన్ ఛార్జాలు హబీబ్, శాద, టిడిపి పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు, టిడిపి ముఖ్య నేతలు పాల్గొన్నారు
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

