Hindupur: మహిళా సాధికారత వైయస్ జగన్మోహన్ రెడ్డి తోనే సాధ్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జ్ దీపికా వేణు రెడ్డి స్పష్టం చేశారు.
హిందూపురం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో మంగళవారం సాయంత్రం శ్రీ సత్యసాయి జిల్లా స్థాయి మహిళా విభాగం సదస్సు ఏర్పాటు చేశారు.సందర్భంగా వైసీపీ నియోజకవర్గ గుడ్డంపల్లి వేణురెడ్డి ఘన స్వాగతం పలికారు.
Read Also:Collector Himanshu Shukla: మహిళలపై లైంగిక వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవు: కలెక్టర్
YSRCP Women Conference Hindupurముఖ్యఅతిథిగా రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీ, జోనల్ విభాగం ప్రెసిడెంట్ ఎస్ విజయ మనోహరి, గాజుల శ్వేతా రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ పాటు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి మహిళా విభాగం అధ్యక్షురాళ్ళు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటినుండి మహిళలకు ఏమి చేశారో అని నిలదీశారు.
Hindupur: కూటమి హామీలపై నిలదీత
అదే విధంగా మహిళలకు ఎన్నో పథకాలు ఇస్తామని ఎన్నికల్లో చెప్పి ఇప్పటివరకు ఏదీ ఇవ్వకుండా ఉచిత గ్యాస్ అన్నారు. గ్యాస్ తుస్సు మన్నదని, బిసి మహిళలు 50 ఏళ్ళు పై బడిన వారికి ఆర్థికంగా ఆదుకుంటామని ఆ ఊసే లేదని, ఇలా ఎన్నెన్నో పథకాలు చెప్పి ఒకటి కూడా అమలు చేయడం లేదని మండిపడ్డారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలకు అనేక పథకాలు అమలు చేసి నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో వేశారని గుర్తు చేసుకున్నారు.

మహిళా సాధికారత జగనన్నతోనే సాధ్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు నాగమణి, పెనుగొండ నియోజకవర్గం పరిశీలకురాలు మధుమతి రెడ్డి, మాజీ మహిళా ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.అంతకుముందు పట్టణంలోని బైపాస్ రోడ్డు లో ఓ టీవీ ఛానల్ అధినేత మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

